For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన పంత్.. లంకను దాటిన కివీస్!

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ముగియడంతో ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్ ప్రకటించింది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఏకంగా అయిదు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. మరోవైపు యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఓ స్థానం కోల్పోయి నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. టాప్-10లో భారత బ్యాటర్లలో పంత్, జైస్వాల్ మినహా ఎవరూ చోటు దక్కించుకోలేదు.

న్యూజిలాండ్‌తో ఆఖరి టెస్టులోనూ ఓడి సిరీస్‌ను 0-3తో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా తొలిసారి వైట్‌వాష్‌కు గురికావడం ఇదే తొలిసారి. అయితే న్యూజిలాండ్ చివరి టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్ ఎనిమిది స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో సత్తాచాటిన శుభ్‌మన్ గిల్ నాలుగు స్థానాలు మెరుగపర్చుకుని 16వ ర్యాంక్‌లో నిలిచాడు.

Rishabh Pant Climbs ICC Test Batter Rankings After Stellar Mumbai Test Performance

ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్, న్యూజిలాండ్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. జైస్వాల్ ఓ స్థానాన్ని కోల్పోవడంతో ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కివీస్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లి 8 స్థానాలు పడిపోయి 22వ ర్యాంక్‌లో, రోహిత్ శర్మ రెండు ర్యాంక్‌లు చేజార్చుకుని 26వ స్థానంలో ఉన్నాడు. దశాబ్దం తర్వాత కోహ్లి టాప్20లో చోటు కోల్పోయాడు.

ఇక మూడో టెస్టులో పది వికెట్లతో సత్తాచాటిన రవీంద్ర జడేజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. అశ్విన్ ఓ ర్యాంక్‌ను కోల్పోయి అయిదో స్థానానికి పడిపోయాడు. బుమ్రా మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ, ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్ తొలి రెండు ర్యాంకింగ్స్‌లో ఉన్నారు.

ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. న్యూజిలాండ్ సిరీస్‌లో భారత తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అక్షర్ పటేల్ ఓ ర్యాంక్‌ను కోల్పోయి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. టీమిండియాను వైట్ వాష్ చేసిన న్యూజిలాండ్ ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని టాప్-5లో నిలిచింది. శ్రీలంక ఆరో స్థానానికి పడిపోయింది.

Story first published: Wednesday, November 6, 2024, 15:10 [IST]
Other articles published on Nov 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+