Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: పంత్ ముందు ఒకే ఒక ఛాన్స్.. అది ఉపయోగించుకుంటే మళ్లీ టీమిండియాలోకి!

Rishabh Pant can still make a comeback to Team India

వచ్చే ఏడాది టీమిండియా ఆడే తొలి పరిమిత ఓవర్ల సిరీస్‌లో యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టారు. టీ20లతోపాటు వన్డే సిరీస్‌కు కూడా అతన్ని ఎంపిక చేయలేదు. అతని స్థానంలో రెండు సిరీసుల్లో మరో యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌కు అవకాశం కల్పించారు. టీ20 బృందంలో సంజూ శాంసన్‌‌ను కూడా ఎంపిక చేశారు. దీంతో చాలా మంది ఇక ఈ ఫార్మాట్లలో పంత్ కెరీర్ ముగిసిందని కామెంట్లు చేస్తున్నారు.

టీ20ల్లో ఏమాత్రం ఆకట్టుకోలేదు..

టీ20ల్లో ఏమాత్రం ఆకట్టుకోలేదు..

పొట్టి ఫార్మాట్లో రిషభ్ పంత్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. కెరీర్ ఆరంభం నుంచి అతను ఈ ఫార్మాట్‌లో ఎలాంటి అద్భుతాలు చేయలేదు. ఇప్పుడు 60కి పైగా మ్యాచులు ఆడినా అతని యావరేజి, స్ట్రైక్ రేటు చాలా చెత్తగా ఉన్నాయి. దానికితోడు ఇటీవలి కాలంలో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లు రాణిస్తున్నారు. అయినా వాళ్లను పక్కన పెట్టి పంత్‌కు సెలెక్టర్లు ఓటు వేస్తూ వచ్చారు ఈ అవకాశాలను పంత్ ఏమాత్రం యూజ్ చేసుకోలేదు. చివరి ఐదు టీ20 మ్యాచుల్లో అతని స్కోర్లు వరుసగా 27, 3, 6, 6, 11 మాత్రమే.

వన్డేల్లో కూడా అంతంతమాత్రమే..

వన్డేల్లో కూడా అంతంతమాత్రమే..

వన్డేల్లో కూడా ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీ తప్ప అతని కెరీర్‌ మొత్తంలో చెప్పుకోదగ్గ విషయం ఏం లేదు. ఈ ఏడాది పది ఇన్నింగ్సుల్లో 336 పరుగులు చేశాడు. వీటిలో ఇంగ్లండ్‌పై సెంచరీ తీసేస్తే.. 9 ఇన్నింగ్సుల్లో కలిపి అతను చేసింది 200పైచిలుకు పరుగులే అన్నమాట. ఈ క్రమంలోనే శ్రీలంక సిరీస్‌కు అతన్ని పక్కన పెట్టేశారు సెలెక్టర్లు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ కెరీర్ ముగిసిందని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే అలాంటిదేం లేదని మాజీ సెలెక్టర్ సాబా కరీం అంటున్నాడు.

ఐపీఎల్ మంచి అవకాశం..

ఐపీఎల్ మంచి అవకాశం..

వచ్చే ఐపీఎల్‌లో కనుక పంత్ సత్తా చాటితే మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేసే అవకాశం కచ్చితంగా ఉంటుందని చెప్పాడు. ఇది అతనికి కేవలం ఒక సెట్ బ్యాక్ మాత్రమేనని, ఐపీఎల్‌ను ఉపయోగించుకొని మళ్లీ జట్టులోకి రావొచ్చని అన్నాడు. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీని కూడా టీ20 సెటప్‌కు సెలెక్టర్లు దూరంగా ఉంచుతున్నారు. అతను కూడా ఐపీఎల్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీ20 జట్టులో పునరాగమనం చేసే అవకాశం ఉందని సాబా కరీమ్ అభిప్రాయపడ్డాడు.

భారత టీ20 జట్టు

భారత టీ20 జట్టు

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠీ, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముఖేష్ కుమార్

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్

Story first published: Wednesday, December 28, 2022, 14:36 [IST]
Other articles published on Dec 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+