ODI World Cup : వచ్చే ఏడాది కూడా లేనట్లే?.. పంత్ హెల్త్ విషయంలో షాకింగ్ అప్‌డేట్!

కొత్త ఏడాదికి ఇంటికెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరోగ్యం గురించి షాకింగ్ వార్త తెలిసింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతను ఆడటం లేదని ఇప్పటికే సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. అయితే తాజాగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పంత్ కేవలం ఈ ఐపీఎల్ మాత్రమే కాదు. వన్డే వరల్డ్ కప్ కూడా మిస్ అవుతాడట. వచ్చే ఏడాదిలో జరిగే టీ20 వరల్డ్ కప్ కూడా అతను ఆడబోడని తెలుస్తోంది.

18 నెలలు దూరమే?
పంత్ కనీసం 18 నెలల పాటు క్రికెట్‌కు దూరం అవుతాడని కొందరు నిపుణులు చెప్తున్నారు. దీంతో అతను వచ్చే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఐపీఎల్ మాత్రమే కాకుండా వన్డే వరల్డ్ కప్ కూడా ఆడలేడని తెలుస్తోంది. అంతేకాదు, ఆ తర్వాత జరిగే సిరీసుల్లో కూడా పంత్ ఆడలేడు.
వచ్చే ఏడాది జూన్ నెలలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో కూడా పంత్ ఆడటం అనుమానమే. టెస్టుల్లో భారత్‌కు పంత్ చాలా కీలకమైన ఆటగాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ కచ్చితంగా నెగ్గాలి. ఈ సిరీస్‌లో పంత్ లేని లోటు కచ్చితంగా కనిపిస్తుందని మాజీలు అంటున్నారు.

తొందర వద్దు..
'పంత్ వికెట్ కీపర్ కాబట్టి అతను చేసే ప్రతి పనీ మోకాళ్లపైనే భారం చూపుతుంది. వికెట్ల వెనుక కూర్చోవాలన్నా.. పక్కలకు చటుక్కున దూకాలన్నా మోకాళ్లు పర్‌ఫెక్ట్‌గా ఉండటం అవసరం. వాటికే శస్త్రచికిత్స జరగడం వల్ల తను కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని అతన్ని తొందరపెట్టడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి పంత్ కోలుకోవడానికి చాలా టైం పడుతుంది' అని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. మరి పంత్ మళ్లీ జట్టుతో ఎప్పుడు కలుస్తాడో చూడాలి. పంత్ క్రికెట్‌కు దూరం అవడంతో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో కొత్త కెప్టెన్ వేటలో పడిన సంగతి తెలిసిందే.

మోకాళ్లకు ఆపరేషన్లు..
కొత్త ఏడాదిలో తల్లికి సర్‌ప్రయిజ్ ఇద్దామని వెళ్తుండగా రూర్కీ సమీపంలో పంత్ కారుకు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో అతనికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పంత్ కొంత కోలుకున్న తర్వాత అతన్ని ముంబైలోని అంబానీ హాస్పిటల్‌కు బీసీసీఐ తీసుకొచ్చింది. ఈ ఆస్పత్రిలోనే పంత్‌కు పలు శస్త్రచికిత్సలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అతని మోకాళ్లకు రెండు ఆపరేషన్లు చేసినట్లు సమాచారం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications