For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాలీవుడ్ హీరోయిన్‌ని వాట్సాప్‌లో బ్లాక్‌ చేసిన పంత్‌!!

Rishabh Pant Blocks Urvashi Rautela On Whatsapp || Oneindia Telugu
Rishabh Pant Blocks Urvashi Rautela on WhatsApp

ముంబై: టీమిండియా క్రికెటర్లు, బాలీవుడ్‌ హీరోయిన్‌ల మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య ప్రేమయణం అంటే రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఈ రూమర్స్‌ను కొందరు నిజం చేసారు కూడా. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, జహీర్‌ ఖాన్-సాగరిక, హర్భజన్‌ సింగ్-గీతా బస్రా, యువరాజ్ సింగ్-హజెల్‌ కీచ్ కొద్దికాలం ప్రేమలో ఉండి తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ప్రస్తుతం యువ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్‌ల హవా నడుస్తోంది. ఇటీవలే ప్రియురాలు నటాషాతో పాండ్యా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. రాహుల్ అతియా శెట్టితో ప్రేమలో ఉన్నాడు. ఇక ఇషా నేగీతో పంత్‌ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆమెతో జీవితం పంచుకోవాలని కోరుకుంటున్నాడు. జనవరి 1న ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. అయితే తాజాగా వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రిషబ్ పంత్‌ బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెలా వాట్సప్‌ నంబర్‌ను బ్లాక్‌ చేశాడట. వీరిద్దరూ గతంలో పార్టీలకు కలిసిన వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన వార్తలు సైతం బయటకు వచ్చాయి. ఇటీవల పంత్‌తో టచ్‌లోకి వచ్చేందుకు ఊర్వశి చాలాసార్లు ప్రయత్నించినా.. పంత్ ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడటంలేదని సమాచారం. పదేపదే విసిగిస్తుందని అనుకున్నాడో ఏమో కానీ ఆమె నంబర్‌ను వాట్సాప్‌లో బ్లాక్‌ చేశాడట. వారిద్దరూ పరస్పరం చర్చించుకున్నాకే నంబర్లు బ్లాక్‌ చేసుకున్నారని ఊరశ్వి సహాయకుడు చెప్పినట్టు తెలిసింది.

క్రికెటర్లతో ఊర్వశి రౌతెలా సంబంధాలపై వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. 2018లోనూ ఆమె హార్దిక్‌ పాండ్యాతో కలిసి ఓ పార్టీలో పాల్గొందని తెలిసింది. ఆ తర్వాత పాండ్యా ఆమెకు దూరం జరిగాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. అనంతరం పంత్‌తో ప్రేమలో పడింది. అదికూడా బెడిసికొట్టింది.

ఇటీవల రిషబ్ పంత్ టీవీ నటి ఇషా నేగితో కలిసి క్రిస్ట్‌మస్‌, న్యూఇయర్‌ వేడుకలు చేసుకున్నాడు. తనకు దొరికిన ఖాళీ సమయాన్ని గర్ల్‌ఫ్రెండ్‌ ఇషాతో గడపడానికి పంత్‌ కేటాయించాడు. వేడుకలలో భాగంగా పంత్-ఇషా మంచు పర్వతాలపై ఎంజాయ్ చేశారు. వీటికి సంబందించిన ఫొటోను ఇద్దరు సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేశారు. దీంతో పంత్-ఇషాల జోడి ప్రేమాయణం మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది. పంత్ ఫొటో షేర్ చేస్తూ.. 'ఎప‍్పుడైతే నీతో ఉంటానో.. అప్పుడు నన్ను నేను బాగా ఇష్టపడుతున్నా' అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

Story first published: Sunday, January 12, 2020, 17:34 [IST]
Other articles published on Jan 12, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+