Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదే మా కొంపముంచింది: రిషబ్ పంత్

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సీఎస్కేతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలైంది. ఓటమి అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తన మనసులోని మాటను పంచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రిషబ్ పంత్ మాట్లాడుతూ.. ఇదొక అద్భుతమైన మ్యాచ్ అని, రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయని అభిప్రాయపడ్డాడు. చెన్నైలో మ్యాచ్ అంటేనే ఒత్తిడి ఉంటుందని మాకు తెలుసని.. దానికి తగ్గట్టుగానే సీఎస్కే తమపై తీవ్ర ఒత్తిడి పెంచిందని పంత్ పేర్కొన్నాడు.

ఫీల్డింగ్ వైఫల్యం.. క్యాచ్‌ల డ్రాప్
ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ అని రిషబ్ పంత్ బాహాటంగానే ఒప్పుకున్నాడు. టీ20 క్రికెట్‌లో ఫీల్డింగ్ ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉండాలని.. కానీ ఈరోజు తమ జట్టులో మరీ ఎక్కువగా క్యాచ్‌లు డ్రాప్ అయ్యాయని అసహనం వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ సరిగ్గా లేకపోతే భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడం కష్టమని రిషబ్ పంత్ గుర్తుచేశాడు.

Rishabh Pant Blames Poor Fielding for Lucknow Super Giants Defeat to CSK Praises Urvil Patel Knock

ఉర్విల్ పటేల్, జోష్ ఇంగ్లిస్ ఇన్నింగ్స్‌పై ప్రశంసలు
సీఎస్కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ ఆడిన ఇన్నింగ్స్‌ను రిషబ్ పంత్ కొనియాడాడు. ఉర్విల్ నమ్మశక్యం కాని రీతిలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని.. లక్నో జట్టు కోసం జోష్ ఇంగ్లిస్ ఎలాగైతే విధ్వంసం సృష్టించాడో, సీఎస్కే కోసం ఉర్విల్ కూడా అదే స్థాయిలో మెరుపులు మెరిపించాడని చెప్పాడు. ఎవరో ఒకరు ఎదురుదాడి చేయాల్సి ఉంటుందని.. తమ తరఫున ఇంగ్లిస్ ఆ పని చేస్తే, వారి తరఫున ఉర్విల్ ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాడని రిషబ్ పంత్ విశ్లేషించాడు.

స్కోరు అంచనా, బౌలింగ్ వ్యూహాలు
తమ ఇన్నింగ్స్ ఆరంభమైన తీరు చూసి కనీసం 210 పరుగులు చేస్తామని భావించామని.. అయితే 203 పరుగులు కూడా మంచి స్కోరేనని పంత్ అన్నాడు. ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్.. ఆ తర్వాత నెమ్మదించిందని తెలిపాడు. చివరి ఓవర్‌లో షాబాజ్ అహ్మద్‌తో బౌలింగ్ చేయించాలనే ఆలోచన వచ్చినప్పటికీ. అప్పుడు క్రీజులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఉండటం వల్ల మార్‌క్రమ్ వైపే మొగ్గు చూపామని చెప్పాడు. మార్‌క్రమ్ గతంలో ఇలాంటి పరిస్థితుల్లో వికెట్లు తీసిన అనుభవం ఉండటంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు రిషబ్ పంత్ వివరించాడు.

Story first published: Sunday, May 10, 2026, 20:13 [IST]
Other articles published on May 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+