Rishabh Pant: ఆ విషయంలో ఇప్పటికీ సురేష్ రైనానే తోపు.. సెకండ్ పంత్, ఆ తర్వాతే ధోనీ, కోహ్లీ..!

దక్షిణాఫ్రికా సిరీస్ ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందు కేఎల్ రాహుల్ గాయపడడంతో టీ20 కెప్టెన్సీ పగ్గాలు రిషబ్ చేతికి అందిన సంగతి తెలిసిందే. గురువారం (జూన్ 9న) న్యూఢిల్లీలో దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వికెట్‌కీపర్ కం బ్యాటర్ అయిన రిషబ్ పంత్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా రాహుల్, చేతికి గాయం కారణంగా చైనామాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్ నుంచి వైదొలిగారు.
ఇక ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రిషబ్.. రాహుల్ అనూహ్యంగా సిరీస్‌కు దూరం కావడంతో వైస్ కెప్టెన్ నుంచి కెప్టెన్సీ స్థాయికి ఎగబాకాడు. ఇకపోతే పంత్ కెప్టెన్సీ విషయంలో ఓ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీల కంటే తక్కువ వయసులో టీ20 కెప్టెన్ అయిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. అలాగే అతి తక్కువ వయసులో టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టిన రెండో ప్లేయర్‌గా పంత్ నిలిచాడు.

రైనా అందరికంటే తక్కువ వయసులో..
ఇక పోతే అతి తక్కువ వయసులో టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన ప్లేయర్ల లిస్టులో (23సంవత్సరాల 197రోజుల వయసు) సురేశ్ రైనా తొలిస్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పటికీ అతి పిన్న వయస్సులో టీ20 కెప్టెన్ రికార్డు రైనా పేరిటే ఉంది. రైనా తర్వాత 1997 అక్టోబర్‌లో జన్మించిన పంత్ 24ఏళ్ల వయస్సులో కెప్టెన్సీ చేపట్టి.. రెండో అతి చిన్న వయసు కెప్టెన్‌గా నిలిచాడు.
ఇకపోతే 2007లో టీ20ప్రపంచకప్‌లో టీమిండియాకు కెప్టెన్సీ వహించినప్పుడు ధోనీ వయస్సు 26సంవత్సరాలతో మూడో స్థానంలో ఉన్నాడు. 2006లో దక్షిణాఫ్రికాతో జరిగిన భారత తొలి టీ20 మ్యాచ్ కెప్టెన్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ 28 సంవత్సరాల వయసుతో నాలుగో స్థానంలో, కోహ్లీ 28సంవత్సరాల వయసుతో 5వ స్థానంలో ఉన్నారు.
2015లో జింబాబ్వే పర్యటనలో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్యా రహానే వయసు 28ఏళ్లు కాగా.. 30ఏళ్ల వయస్సులో కేఎల్ రాహుల్ టీమిండియా టీ20జట్టుకు కెప్టెన్సీ వహించిన అత్యంత ఎక్కువ వయసు ఆటగాడిగా నిలిచాడు.

నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను
తొలి టీ20 మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో రిషబ్ పంత్ మాట్లాడుతూ.. 'మ్యాచ్‌కు 24గంటల ముందు నేను టీమిండియాను లీడ్ చేయాలనే విషయాన్ని తెలుసుకున్నాను. ఈ విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని వాగ్దానం చేస్తున్నా.
జట్టులో ఇలా జరగడం కాస్త బాధకరం( కేఎల్ రాహుల్ గాయపడి కెప్టెన్సీ కోల్పోవడం), కానీ ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నమ్మి కెప్టెన్‌గా చేయడం చాలా మంచి అనుభూతి. నేను బీసీసీఐ నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. భారత జట్టుకు నాయకత్వం వహించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.
ఈ అవకాశాన్ని నేను తప్పకుండా యుటిలైజ్ చేసుకుని ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తాను. నా క్రికెట్ కెరీర్ మరింత ఉన్నతంగా మారేందుకు ప్రతిరోజు ప్రయత్నిస్తాను.' అని పంత్ పేర్కొన్నాడు.

భారత జట్టు:
రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ హుడా, వెంకటేష్ సింగ్ అయ్యర్, అర్ష్‌దీప్ అయ్యర్, రవి బిష్ణోయ్, ఉమ్రాన్ మాలిక్
దక్షిణాఫ్రికా జట్టు:
క్వింటన్ డి కాక్ (WK), టెంబా బావుమా (c), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడ, కేశవ్ సార్త్‌జే, అన్రిచ్ నోహమ్‌సి వేన్ పార్నెల్, లుంగి ఎన్గిడి, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications