Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంత్‌ను వరల్డ్‌కప్‌లో ఆడించాల్సిందే: వార్న్ వ్యాఖ్యలను సమర్ధించిన సన్నీ

The Selection Committee Has Started Drills To Select The World Cup Team | Oneindia Telugu
 Rishabh Pant as opener? Sunil Gavaskar backs Shane Warnes idea ahead of Australia series

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ జట్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉండాలనే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేరాడు. పంత్‌ను వరల్డ్‌కప్‌లో ఆడించాల్సిందేనంటూ సునీల్‌ గావస్కర్‌ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరిస్‌లో రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ సూచించిన విషయం తెలిసిందే.

వార్న్‌ సలహా మంచిదే

వార్న్‌ సలహా మంచిదే

తాజాగా ఇండియా టుడేతో షేన్ వార్న్‌ సలహా మంచిదేనని, ఈ దిశగా టీమిండియా ఆలోచించాలని గవాస్కర్‌ పేర్కొన్నాడు. అంతేకాదు పంత్‌ను ఓపెనర్‌గా ఆడించడం వల్ల వచ్చే నష్టం ఏం లేదని, అతను చెలరేగితో మిడిలార్డర్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని సునీల్ గవాస్కర్ వెల్లడించాడు.

పంత్‌ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్‌

పంత్‌ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్‌

"పంత్‌ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్‌. ఎడమ-కుడి బ్యాట్స్‌మెన్‌ కాంబినేషన్‌ను ఎదుర్కొవడం బౌలర్లకు కష్టమైన పని. ఇలానే రోహిత్‌-ధావన్‌ కాంబినేషన్‌ విజయవంతమైంది. గతంలో సచిన్‌-గంగూలీ, సెహ్వాగ్‌-గంగూలీలు జోడిలు కూడా ఓపెనర్లుగా రాణించాయి. పంత్‌ కూడా ఓపెనర్‌గా రాణిస్తాడు. ఇది జట్టుకు కలిసొచ్చే అంశం" అని గవాస్కర్ వివరించాడు.

పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో

పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో

గురువారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో మాజీ పేసర్ ఆశిశ్‌ నెహ్రా సైతం పంత్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. నెహ్రా మాట్లాడుతూ "జట్టు విజయంలో చాలా మంది పాత్ర పోషిస్తుండవచ్చు. వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నీల్లో ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న ప్లేయర్స్ కావాలి. పంత్ కచ్చితంగా ఓ మ్యాచ్ విన్నర్. అతన్ని కచ్చితంగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలి" అని నెహ్రా అన్నాడు.

ఓపెనర్ శిఖర్ ధావన్‌ తప్ప

ఓపెనర్ శిఖర్ ధావన్‌ తప్ప

"ప్రస్తుతం భారత జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్‌ తప్ప తొలి ఏడు మంది బ్యాట్స్‌మెన్‌లో మరో ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ లేడు. జట్టులో ఎడమ, కుడి కాంబినేషన్ కచ్చితంగా ఉండాలి. ఇక్కడ రిషబ్ పంత్ పనికొస్తాడు. దీంతో పాటు రెండోది రిషబ్ పంత్ ఒకటో నంబర్ నుంచి ఏడో స్థానం వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు" అని నెహ్రా చెప్పాడు.

పంత్ సునాయాసంగా సిక్స్‌లు బాదగలడు

పంత్ సునాయాసంగా సిక్స్‌లు బాదగలడు

"పంత్ సునాయాసంగా సిక్స్‌లు బాదగలడు. రోహిత్ శర్మ తర్వాత జట్టులో పంత్‌కే ఆ సత్తా ఉంది. ఒత్తిడి సమయంలో ఏ మాత్రం భయపడకుండా ఆడగలడు. ప్రస్తుతం టీమ్‌కు అదే కావాలి. దీనికి తోడు ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగలడు. ప్రస్తుతం జట్టులో కోహ్లీ, రోహిత్, బుమ్రా రూపంలో ముగ్గురు మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. రిషబ్ పంత్ నాలుగోవాడు" అని ఆశిష్ నెహ్రా అన్నాడు.

ధోని కోసం పంత్‌ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు

ధోని కోసం పంత్‌ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు

ఆసీస్ మాజీ స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ సైతం ధోని కోసం పంత్‌ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదని, వికెట్‌కీపర్‌గా కాకుండా బ్యాట్స్‌మన్‌గా పరిగణించి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లోనే పంత్‌ను ఓపెనర్‌గా పంపించి ప్రయోగం చేయాలన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధావన్‌ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ జట్టు గెలుపు కోసం కొన్ని త్యాగాలు చేయలన్నాడు.

Story first published: Friday, February 15, 2019, 11:53 [IST]
Other articles published on Feb 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+