
దక్షిణాఫ్రికా పర్యటనలో బిజీగా ఉన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్‌పంత్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. రిషబ్ పంత్‌ను ఉత్తరాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధకారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రాష్ట్ర యువత క్రీడలు, ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా ప్రత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాకుండా రిషబ్‌పంత్‌కు సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్వయంగా వీడియో కాల్ చేసి ఈ విషయాన్ని తెలిపారు.
అంతేకాకుండా ఈ సందర్భంగా సీఎం.. పంత్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాఖండ్ ప్రజలకు క్రీడలు, ఫిట్‌నెస్‌పై మరింత అవగాహన పెంచేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా పంత్.. సీఎంకు తెలిపాడు. అంతేకాకుండా తనకు బ్రాండ్ ఆంబాసిడర్‌గా అవకాశం ఇచ్చిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్‌లో పంత్ రిప్లే ఇచ్చాడు. ఈ సందర్భంగా రిషబ్‌పంత్‌పై ఉత్తరాఖండ్ సీఎం ప్రశంసలు కురిపంచారు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లలో పంత్ కూడా ఒకడని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. అంతేకాకుండా దేశ యువతకు పంత్ ఆరాధ్య దైవమని పుష్కర్ సింగ్ అన్నారు.
24 ఏళ్ల రిషబ్ పంత్ ప్రస్తుతం భారత జట్టులోని అన్ని ఫార్మాట్లలో కీలక ఆటగాడు. అన్ని ఫార్మాట్లలో వికెట్ కీపింగ్‌తోపాటు బ్యాటింగ్‌లో పంత్ కీలకంగా ఉన్నాడు. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో పంత్ బిజీగా ఉన్నాడు. ఈ నెల 26 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. దక్షిణాఫ్రికాతో ఈ నెల 26 నుంచి టీమిండియా 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌తోపాటు 3 వన్డేల సిరీస్ కూడా ఆడనుంది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రిషబ్ పంత్.. 39 సగటుతో 1549 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలతోపాటు 7 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
అత్యధిక వ్యక్తిగత స్కోర్ 159 పరుగులు. ఇక 18 వన్డే మ్యాచ్‌లు ఆడిన పంత్ 33 సగటుతో 529 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 41 టీ20 మ్యాచ్‌లు ఆడిన పంత్ 23 సగటుతో 623 పరుగులు చేశాడు. రెండు సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అలాగే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 84 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన పంత్ 35 సగటుతో 2498 పరుగులు చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.