Cheteshwar Pujara: టీ20 వరల్డ్‌కప్ భారత తుది జట్టులో వాళ్లిద్దరు ఉండాల్సిందే..!

టీ20 వరల్డ్‌కప్ తుది ప్లేయింగ్ 11 జట్టులో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ మధ్య ఎవరుండాలి అనే విషయమై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక ఈ విషయమై భారత టెస్ట్ స్పెషలిస్టు బ్యాటర్ చటేశ్వర్ పుజారా మాట్లాడుతూ.. పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరు భారత ప్లేయింగ్ XIలో కొనసాగాలని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 16నుంచి మొదలు కావాల్సి ఉందనే సంగతి తెలిసిందే. ఇక ఆసియా కప్ జట్టుకు ఫినిషర్‌గా ఎంపికైన దినేష్ కార్తీక్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. రిషబ్ పంత్‌కు బ్యాటింగ్ అవకాశం వచ్చినా అతను ఆకట్టుకోలేకపోయాడు. టీ20 ప్రపంచకప్ జట్టులో కార్తీక్ ఫినిషర్‌గా కొనసాగాలని, పంత్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఉండాలని పుజారా పేర్కొన్నాడు.

ఆ మూడు స్థానాల్లో ఈ ముగ్గురు
టీ20 వరల్డ్ కప్ టీమిండియా ప్లేయింగ్ 11 గురించి పుజారా స్పందిస్తూ.. 'నేను నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7బ్యాటర్లను గనుక ఎంచుకోవాల్సి వస్తే నంబర్ 5లో రిషబ్ పంత్‌ను నంబర్ 7లో దినేష్ కార్తీక్‌ను తీసుకోవాలని చూస్తాను. ఆసియా కప్ ద్వారా తేలిందేంటంటే మన జట్టు బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కావాలని' అని పుజారా ESPNcricinfoతో అన్నారు.
'నంబర్ 5 బ్యాటర్‌గా రిషబ్ దిగాక.. హార్దిక్ పాండ్యా కూడా ఫినిషర్ రోల్‌లో నెం.6లో బరిలోకి దిగితే బాగుంటుంది. నెం.7లో డీకే ఎలాగూ ఫినిషింగ్ చూపించగలడు. అందువల్లే పంత్, డీకేను ఇద్దరిని టీమిండియా ప్లేయింగ్ 11లోకి తీసుకోవాలని చెబుతాను' అని పుజారా చెప్పాడు. అయితే భారత్‌కు అదనపు బౌలింగ్ ఎంపిక కావాలంటే.. రిషబ్ పంత్ స్థానంలో దీపక్ హుడాను ప్లేయింగ్ 11లోకి తీసుకుంటే బెటర్ అని పుజారా చెప్పాడు. అలాంటప్పుడు దీపక్ నంబర్ 5 బ్యాటర్‌గా బరిలోకి దిగాల్సిన అవసరముంది అని పుజారా చెప్పాడు.

రవీంద్రా జడేజా దూరం కావడంతో
ఇక భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు మోకాలి గాయం కావడం, సర్జరీ జరగడంతో ఆసియా కప్ సూపర్ 4 స్టేజ్‌కు అతను దూరమైన సంగతి తెలిసిందే. అతను జట్టుకు దూరం కావడంతో టీమిండియా మిడిలార్డర్ సమతూకం కాస్త దెబ్బతిన్నట్లుకన్పిస్తంది. తొలుత అక్టోబర్‌లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ వరకు అతను కోలుకుంటాడని భావిస్తే.. అతను మాత్రం కోలుకోవడానికి ఆరువారాల టైం పట్టనుంది. దీంతో అతను టీ20 ప్రపంచకప్ టోర్నీకి కూడా దూరం కావాల్సి వచ్చింది. రవీంద్ర జడేజా లేకపోవడంతో లెఫ్టాండర్ అయిన రిషబ్ పంత్ జట్టులో ఉండాలని టీం మేనేజ్ మెంట్ భావిస్తుంది.

ఆసియాకప్‌లో డీకేకు దక్కని అవకాశాలు
ఆసియాకప్ 2022 టోర్నీలో మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.. కేవలం ఒకే ఒక్క బంతి ఆడాడు. ఒక్క రన్ తీశాడు. అది కూడా పాకిస్థాన్‌తో ఉత్కంఠగా జరిగిన తొలి మ్యాచ్‌లో.. ఆ తర్వాత హార్దిక్ తనదైన శైలిలో ఆ మ్యాచ్‌ను గెలిపించాడు. అనంతరం హాంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో డీకేకు బ్యాటింగ్ రాకపోగా.. సూపర్ 4లో పాకిస్థాన్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో అతనికి చోటు దక్కలేదు. ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా పరాజయం పాలవ్వడంతో కార్తీక్ విలువ ఏంటో తెలిసొచ్చింది.
దాంతో అఫ్గాన్‌తో గురువారం జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో కార్తీక్ కాకకు టీమ్‌మేనేజ్‌మెంట్ మళ్లీ చాన్స్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లోనూ డీకేకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో చెలరేగడంతో పాటు కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించడంతో డీకే బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరమే లేకుండా పోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications