Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీని విజేతగా చూడాలనుకుంటున్నా: పంత్ మనసులో మాట

IPL 2019 : Rishabh Pant Aiming To Secure World Cup Berth With A Good Show In IPL | Oneindia Telugu
Rishabh Pant aiming to secure World Cup berth with a good show in IPL 2019

హైదరాబాద్: ప్రస్తుతం తన ధ్యాసంతా ఐపీఎల్‌ మీదే ఉందని, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుని టైటిల్ విజేతగా చూడాలనుకుంటున్నాని ఆ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ తెలిపాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌‌లో పంత్ పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. చివరి రెండు వన్డేల్లో ధోని స్థానంలో చోటు దక్కించుకున్న పంత్ ఆశించిన మేరకు రాణించలేదు.

పంత్ మాట్లాడుతూ

పంత్ మాట్లాడుతూ

ముఖ్యంగా నాలుగో వన్డేలో రిషబ్ పంత్ చేసిన తప్పిదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్ 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ మాట్లాడుతూ "వరల్డ్‌కప్‌లో ఆడాలని మా మనసులో ఎప్పటికీ ఉంటుంది. ప్రస్తుతం నా ధ్యాసంతా ఐపీఎల్‌ మీదే ఉందని, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుని విజేతగా చూడాలనుకుంటున్నా" అని చెప్పాడు.

నా తప్పిదాలను కొన్నింటిని గమనించా

నా తప్పిదాలను కొన్నింటిని గమనించా

"ఒక ఆటగాడిగా ప్రతీరోజూ మెరుగ్గా రాణించాలనే అనుకుంటా. ఇప్పటికే నా తప్పిదాలను కొన్నింటిని గమనించా. వాటిపై దృష్టిపెట్టాలి. నా తప్పిదాల గురించి ఇప్పటికే ధోనీని కలిసి మాట్లాడాను. డ్రెస్సింగ్‌ రూంలో ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతడిని కలిసి ఏదైనా మాట్లాడొచ్చు. ప్రతీ ఒక్క ఆటగాడితో ధోనీ అలాగే ఉంటాడు. అందరినీ కలుపుకొని పోతాడు" అని పంత్ అన్నాడు.

మార్చి 24న ముంబైతో తొలి మ్యాచ్

మార్చి 24న ముంబైతో తొలి మ్యాచ్

"దీంతో అతడు నుంచి మంచి సలహాలు, సూచనలు అందుతాయి. అవి పాటిస్తే మంచిది. లేదా ఎవరిష్టం వారిది" అని పంత్ చెప్పుకొచ్చాడు. టోర్నీలో భాగంగా మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

ఢిల్లీ క్యాపిటల్స్:

అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రాహుల్ తెవాతియా, జయంత్ యాదవ్, మన్జోత్ కల్రా, కాలిన్ మున్రో, క్రిస్ మోరిస్, కగిసో రబాడ, సందీప్ లామిచానే, ట్రెంట్ బౌల్ట్,

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: హనుమ విహారీ (రూ. 2 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 5 కోట్లు), ఇషాంత్ శర్మ (రూ.1.1 కోట్లు), అంకుశ్ బెయిన్స్‌ (రూ.20 లక్షలు), నాథూ సింగ్‌ (రూ.20 లక్షలు), కాలిన్ ఇన్‌గ్రామ్ (రూ.6.4 కోట్లు), షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్‌ (రూ.1.6 కోట్లు), కీమో పాల్‌ (రూ.50 లక్షలు), జలజ్ సక్సేనా (రూ.20 లక్షలు), బండారు అయ్యప్ప (రూ.20 లక్షలు).

Story first published: Tuesday, March 19, 2019, 10:15 [IST]
Other articles published on Mar 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+