ఐసీసీ టెస్ట్ ర్యాంకులు: రిషబ్ పంత్ ఖాతాలో మరో రికార్డు

హైదరాబాద్: సిడ్నీ టెస్టులో సెంచరీ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు కెరీర్‌నే మార్చివేసింది. ఈ సెంచరీతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రిషబ్ పంత్ తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లోనూ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుని అందుకున్నాడు.
ఆసీస్‌తో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ముగిసిన తర్వాత ఐసీసీ మంగళవారం టెస్టు ర్యాంకులను ప్రకటించింది. 21 ఏళ్ల రిషబ్ పంత్ 21 స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు భారత్ తరుపున తొమ్మిది టెస్టులాడిన పంత్‌కు టెస్టుల్లో ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం.

వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్
దీంతో భారత్ తరుపున టెస్టుల్లో అత్యధిక ర్యాంకుని అందుకున్న వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్... మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. అంతేకాదు టెస్టుల్లో భారత్ తరుపున అత్యధిక రేటింగ్ పాయింట్లు అందుకున్న వికెట్ కీపర్ కూడా రిషబ్ పంతే. పంత్ ఖాతాలో 673 పాయింట్లు ఉన్నాయి.

ధోని అత్యుత్తమ ర్యాంకు 19
రిషబ్ పంత్ తర్వాతి స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(662) పాయింట్లతో ఉండగా, ఫరూక్ ఇంజనీర్(619) పాయింట్లు కొనసాగుతున్నారు. టెస్టుల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అత్యుత్తమ ర్యాంకు 19 కావడం విశేషం. 2016లో జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్‌తో పంత్ వెలుగులోకి వచ్చాడు.

18 బంతుల్లో హాఫ్ సెంచరీ
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కాగా, సిడ్నీ టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. దూకుడుగా ఆడిన పంత్ తక్కువ బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. 138 బంతుల్లోనే 8 ఫోర్ల సాయంతో రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు.

తొలి భారత వికెట్ కీపర్‌గా
తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో భారత్ వికెట్ కీపర్‌లు ఎవరూ టెస్ట్ సెంచరీ సాధించలేదు. తొలిసారి పంత్ ఆ ఘనత సాధించాడు. గతంలో ఫారూఖ్ ఇంజినీర్ 1967వ సంవత్సరంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆస్ట్రేలియా పర్యటన చేశాడు.

టెస్టుల్లో రెండో సెంచరీ
ఈ పర్యటనలో ఫారూఖ్ ఇంజినీర్ 89 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన కీపర్‌గా రికార్డు సాధించాడు. ఇక, భారత్ తరుపున ఇప్పటివరకు తొమ్మిది టెస్టులాడిన రిషబ్ పంత్‌కు ఇది రెండో సెంచరీ. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో పంత్ 114 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

20 క్యాచ్‌లు
అంతేకాదు జెఫ్రీ డుజాన్ తర్వాత ఇంగ్లాండ్‌లోనూ, ఆస్ట్రేలియాలోనూ సెంచరీలు చేసిన పర్యాటక జట్టు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. దీంతో పాటు ఒక టెస్ట్ సిరీస్‌లో 200 కంటే పరుగులు, 20 క్యాచ్‌లు అందుకున్న ఉపఖండపు తొలి వికెట్ కీపర్‌గా రిషబ్ అరుదైన ఘనత సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications