ఎంతో పరిపక్వతతో ఆడాడు: పంత్‌పై ఇష్ సోధీ ప్రశంసలు

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో శుక్రవారం జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రదర్శనపై న్యూజిలాండ్ బౌలర్ ఇష్ సోధీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయంలో రిషబ్ పంత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంత్ 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగత తెలిసిందే. దీనిపై మ్యాచ్ అనంతరం కివీస్ జట్టు బౌలర్ ఇష్ సోధీ మాట్లాడాడు.

పంత్ ఎంతో పరిపక్వతతో ఆడాడు
"ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఎంతో పరిపక్వతతో ఆడాడు. తొలుత అతడు సాధారణంగా ఆడటం చూసి పంత్‌ని త్వరగా పెవిలియన్ చేర్చవచ్చు అనుకున్నాను. కానీ నా అంచనా తప్పని తర్వాత తెలిసింది. అతడి గురించి ఇది వరకే విన్నాను. కానీ ఇంత బాగా ఆడతాడని ఊహించలేకోయాను" అని సోధీ అన్నాడు.

నాకు కూడా అదే కోరిక
"రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసిన తీరును మర్చిపోలేకపోతున్నాను. ఇలాంటి ఆటగాడి వికెట్ పడగొట్టాలని ఎవరికి మాత్రం ఉండదు? నాకు కూడా అదే కోరిక ఉంది" అని సోధీ వెల్లడించాడు. ఇక, ఐపీఎల్ 2019 సీజన్ గురించి ఇష్ సోధీ మాట్లాడుతూ ఐపీఎల్ ఆటడం తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ ఆటడం నాకెంతో ఇష్టం
"ఐపీఎల్ ఆటడం నాకెంతో ఇష్టం. భారతీయులెందరో అక్కడి మైదానాల్లోకి వచ్చి వారికి నచ్చిన వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అక్కడ ఆటడానికే కాదు చూడటానికి కూడా బాగుంటుంది" అని తెలిపాడు. ఇదిలా ఉంటే ఇష్ సోధీ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం విశేషం. సోధీ స్వస్థలం పంజాబ్‌లోని లూథియానా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications