Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

#RIPactorVIJAY ట్రెండింగ్‌: తమిళ యువతపై నిప్పులు చెరిగిన అశ్విన్

Cricketer Ashwin Ravichandran Lashes Out At Tamil Youngsters || Oneindia Telugu
#RIPActorVijay trends online: Cricketer Ashwin Ravichandran lashes out at Tamil youngsters

హైదరాబాద్: సినీ అభిమానం హద్దు మీరుతోంది. ఎవరైనా హీరోపై అభిమానం ఉంటే టిక్కెట్ కొనుక్కుని సినిమా చూడాలి. అంతేకానీ, ప్రతీకారాలకు దిగి ప్రత్యర్థి హీరోపై తప్పుడు ప్రచారం చేయకూడదు. తాజాగా తమిళ నాట సూపర్ స్టార్స్‌గా వెలుగొందుతున్న తలా అజిత్ కుమార్, ఇళయ దళపతి విజయ్ అభిమానుల మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

సోషల్ మీడియాలో #RIPactorVIJAY‌ ట్రెండింగ్

సోషల్ మీడియాలో #RIPactorVIJAY‌ ట్రెండింగ్

ఎంతలా ఉంటే హీరో విజయ్ ఇకలేరు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #RIPactorVIJAY‌ను ట్రెండింగ్‌ చేసేంతలా. ఈ నేపథ్యంలో ఈ గొడవపై సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు సైతం తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఈ యాష్ ట్యాగ్‌పై క్రికెటర్ అశ్విన్ రవిచంద్రన్ స్పందించాడు.

ట్విట్టర్‌లో అశ్విన్

తమిళ యువత ఎలా తయారయిందోనని ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడాడు. "కొద్ది రోజుల ముందు ఓ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చి మిస్సయ్యింది. వాతావరణంలో అకాల మార్పులతో ఎన్నో నగరాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా చాలా క్రిమినల్ కేసులు పెరిగిపోతున్నాయి. వీటన్నిటినీ పట్టించుకోకుండా మన యువత మాత్రం #RIPactorVIJAY అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ కూర్చొంటుంది" అని ట్వీట్ చేశాడు.

అభిమానులను అదుపు చేయాలంటూ

అభిమానులను అదుపు చేయాలంటూ

గతంలో ఇదే విధంగా అభిమానులు చేస్తే వాళ్లను అదుపుచేయాలంటూ సామాజిక కార్యకర్తలు ఆయా సెలబ్రిటీలనే కోరారు. హీరోలు నిశ్శబ్దంగా ఊరుకోవడంతో ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇద్దరు హీరోలు చోరవ తీసుకోవాలి అని పలువురు ప్రముఖులు సూచిస్తున్నారు.

అట్లీ దర్శకత్వంలో బిగిల్ అనే సినిమాలో

అట్లీ దర్శకత్వంలో బిగిల్ అనే సినిమాలో

ఇదిలా ఉంటే, విజయ్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బిగిల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దీపావళి 2019 సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నారు. ఇక, అజిత్ నటించిన నెర్కొండ పార్వాయి చిత్రం ఆగస్టు 8వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రం హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రానికి రీమేక్ కావడం విశేషం.

Story first published: Monday, July 29, 2019, 18:26 [IST]
Other articles published on Jul 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+