గ్యాస్ సిలిండర్లు మోస్తున్న రింకూ తండ్రి.. హార్ట్ టచింగ్ (Video)
కొద్దికాలంలోనే టీమిండియా నయా ఫినిషర్‌గా రింకూ సింగ్ పేరు సంపాదించుకున్నాడు. వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకుంటూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రధాన ఆయుధంగా సిద్ధమవుతున్నాడు. అయితే రింకూ సింగ్ తండ్రి ఖన్‌చంద్ర సింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియోలో రింకూ తండ్రి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తూ కనిపించాడు. ఖన్‌చంద్ర సింగ్ గ్యాస్ సిలిండర్ సప్లైర్‌గానే తన అయిదుగురు పిల్లలను పెంచి పెద్దచేసిన విషయం తెలిసిందే. వారిలో మూడో కుమారుడు రింకూ సింగ్ తనకున్న గొప్ప టాలెంట్‌తో టీమిండియా తలుపు తట్టాడు. అయితే రింకూ భారత జట్టులోకి వచ్చిన తర్వాత కూడా తన వృత్తిని ఖన్‌చంద్ర సింగ్ కొనసాగించడంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రింకూ ఫ్యామిలీ గ్రేట్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కష్టాన్ని నమ్ముకునే వాళ్లకు విజయగర్వం ఉండదనడానికి ఇది నిదర్శనమని, హార్ట్ టచింగ్ వీడియో అని అంటున్నారు.

ఇక రింకూ సింగ్ విషయానికొస్తే.. అతడిని మూడు ఫార్మాట్లకు సిద్ధం చేసేలా బీసీసీఐ కీలక చర్యలు చేపడుతోంది. రంజీట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్న రింకూని భారత్-ఎ జట్టుతో బీసీసీఐ చేర్చింది. ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరగనున్న రెండు, మూడు అనధికారికిక టెస్టులకు ఎంపిక చేసింది. అయితే ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండో టెస్టు ఆడిన రింకూ నాలుగు బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. ఒక ఇన్నింగ్స్‌లోనే అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ లయన్స్‌పై భారత్-ఎ జట్టు ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇటీవల జరిగిన అఫ్గానిస్థాన్ మూడో టీ20 అనంతరం రింకూ సింగ్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ కొనియాడిన విషయం తెలిసిందే. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచక్‌కు రింకూ ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా పరోక్షంగా వెల్లడించారు. ప్రశాంతంగా ఉంటూ విపత్తు సృష్టించే రింకూ లాంటి ఆటగాడినే టీమిండియా కోరుకుంటుందని పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications