KKR vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 44వ మ్యాచ్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ డాషింగ్ బ్యాటర్ రింకూ సింగ్ ఓ కీలక ప్రకటన చేశాడు. ఐపీఎల్‌లో 300 పరుగులు సాధించవచ్చని ఈ స్టార్ ఆటగాడు చెప్పుకొచ్చాడు. ఇది కాకుండా రింకూ సింగ్ తన బ్యాటింగ్ స్థానం గురించి కూడా వెల్లడించాడు. జియో హాట్‌స్టార్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో జెన్ బోల్డ్ స్టార్ రింకూ సింగ్ ఫినిషర్‌గా తన పాత్ర గురించి మాట్లాడాడు. రింకూ సింగ్ ఎంఎస్ ధోని నుంచి నేర్చుకున్న దాని గురించి కూడా చెప్పుకొచ్చాడు.
5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడతా..
తాను సాధారణంగా 5 లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తానని చెప్పాడు. దానికి అలవాటుపడినట్లు రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు. తాను ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ చూపుతానని తెలిపాడు. ఎందుకంటే ఐపీఎల్‌లో 14 మ్యాచ్ లు ఉన్నాయని.. ఈ క్రమంలోని శరీరాన్ని కాపాడుకోవడం, బాగా కోలుకోవడం తన బాధ్యత అని పేర్కొన్నాడు. మహీ భాయ్ తో తరచుగా మాట్లాడుతుంటానని.. ధోని ప్రశాంతంగా ఉండి మ్యాచ్ పరిస్థితికి అనుగుణంగా ఆడమని చెబుతాడన్నాడు.

రస్సెల్‌ను చూసి నేర్చుకున్నా..
ఆండ్రీ రస్సెల్ వంటి సీనియర్ ఆటగాళ్ల నుంచి నేర్చుకోవడం ద్వారా బ్యాటర్ గా తాను ఎలా అభివృద్ధి చెందుతున్నానో కూడా రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు. రింకూ సింగ్ జట్టు 300 పరుగుల మార్కును దాటే అవకాశాలు కూడా ఉన్నాయని అన్నాడు. ఐపీఎల్ ఎలా అభివృద్ధి చెందిందో చెప్పడానికి గత విజయవంతమైన ఛేజింగ్‌లను రుజువుగా పేర్కొన్నాడు.
300 స్కోరు చేయగలం..
ఐపీఎల్‌లో ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి రస్సెల్ ను చూసి నేర్చుకుంటున్నానని.. అతడిని దగ్గరగా గమనిస్తానని చెప్పాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో రస్సెల్ ఎలా బ్యాటింగ్ చేస్తాడో, శక్తిని ఉత్పత్తి చేయడానికి తన శరీరాన్ని ఎలా ఉపయోగిస్తాడో చూసి నేర్చుకున్నానని చెప్పాడు. ఐపీఎల్ 300 పరుగులు కూడా సాధ్యమయ్యే స్థాయికి చేరుకుందన్నాడు. గత ఏడాది పంజాబ్ 262 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిందని చెప్పాడు. ఈ సీజన్‌లో అన్ని జట్లు బలంగా ఉన్నాయని.. ఎవరైనా 300 పరుగులు చేరుకోవచ్చని చెప్పాడు.
పంజాబ్ నుంచి పోటీ
ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా 44వ మ్యాచ్ లో కేకేఆర్ పంజాబ్ కింగ్స్ తో తలపడుతోంది. ఈ రోజు(ఏప్రిల్ 26) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు గొప్ప ఫామ్ లో ఉంది. అదే సమయంలో అజింక్య రహానే కెప్టెన్సీలోని కేకేఆర్ గత కొన్ని మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది.