జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత జట్టు సత్తాచాటుతున్న విషయం తెలిసిందే. తొలి టీ20లో ఓటమిపాలైనప్పటికీ, ఆ తర్వాత గొప్పగా పుంజుకుని వరుసగా విజయాలు సాధించింది. మిగిలిన రెండు టీ20ల్లోనూ గెలిచి అయిదు టీ20ల సిరీస్‌ను 4-1తో ముగించాలని చూస్తోంది. కెప్టెన్‌గా భారత జట్టు బాధ్యతలు తొలిసారి అందుకున్న శుభ్‌మన్ గిల్ ఆకట్టుకుంటున్నాడు.
అయితే గిల్‌తో పాటు తన సోదరి షానీల్ గిల్ కూడా జింబాబ్వేలోనే ఉంది. టీమిండియాకు మద్దతు ఇస్తూ మ్యాచ్‌లను వీక్షిస్తుంది. అయితే నయా ఫినిషర్ రింకూ సింగ్‌తో షానీల్ ప్రేమలో ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడమే దానికి కారణం. రెండో టీ20 అనంతరం విరామం దొరకడంతో భారత జట్టు జింబాబ్వేలో జూతో సహా ప్రముఖ ప్రదేశాల్లో పర్యటించింది.

టీమిండియాతో పాటు షానీల్ కూడా వెళ్లింది. ఈ క్రమంలో రింకూ సింగ్, షానీల్ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. వారిద్దరు సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రింకూ-షానీల్ ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. దీంతో షానీల్ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ను డిలీట్ చేయడం గమనార్హం. అయితే వారిద్దరు వార్తల్లో నిలవడం ఇదే ప్రథమం కాదు.
గతంలో రింకూ సింగ్ పోస్ట్ చేసిన ఓ ఫొటోకు షానీల్ స్పందించింది. 'ఓ హీరో' అంటూ కామెంట్ చేసింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రేమ ఉందేమో అంటూ వార్తలు మొదలయ్యాయి. తాజాగా వారిద్దరి సెల్ఫీ వీడియో పోస్ట్ చేయడం, ఆ తర్వాత డిలీట్ చేయడంతో ప్రేమ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. కాగా, టీ20 వరల్డ్ కప్‌లో రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన ఓపెనర్ శుభ్‌మన్ గిల్, నయా ఫినిషర్ రింకూ సింగ్ జింబాబ్వే పర్యటనలో సత్తాచాటుతున్న విషయం తెలిసిందే.
రెండో టీ20లో రింకూ 22 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, అయిదు సిక్సర్లు బాదాడు. మూడో టీ20లో రింకూకు ఒక్క బంతి ఎదుర్కోవడానికి మాత్రమే అవకాశం వచ్చింది. ఒక్క పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు గిల్ తొలి రెండు టీ20ల్లో 31, 2 పరుగులు చేసిన గిల్ మూడో టీ20లో చెలరేగాడు. 49 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు.