సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ రెండో రౌండ్‌కు బీసీసీఐ జట్లను ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరగనున్న మొదటి టెస్టుకు రోహిత్ శర్మ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే భారత జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలోని తమ జట్లను వీడనుండటంతో మార్పులతో కూడిన ఇండియా-ఏ, బీ, సీ, డీ జట్లు వివరాలను బీసీసీఐ మంగళవారం పేర్కొంది.
అయితే బంగ్లాతో మొదటి టెస్టుకు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికైనప్పటికీ, అతను దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ ఆడతాడని బీసీసీఐ తెలిపింది. ఇక స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఈ దేశవాళీ టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. ఆంధ్ర కికెట్ అసోషియేషన్ నుంచి షేక్ రషీద్ అవకాశం దక్కించుకున్నాడు. శుభ్‌మన్ గిల్ స్థానంలో ఇండియా-ఏకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా సెలక్ట్ అయ్యాడు.

ఇక బ్యాటర్‌గా గిల్ స్థానంలో ప్రథమ్ సింగ్ ఎంపికయ్యాడు. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, కుల్‌దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, యశస్వీ జైస్వాల్, రిషభ్ పంత్, యశ్ దయాల్, అక్షర్ పటేల్ స్థానాల్లో వరుసగా అక్షయ్ వాద్కర్, షేక్ రషీద్, షామ్స్ ములానీ, ఆకిబ్ ఖాన్, సుయాస్ ప్రభుదేశాయ్, రింకూ సింగ్, హిమాన్షు, నిషాంత్ సిద్ధు, ఎంపికయ్యారు. గాయం కారణంగా దూరమైన తుషార్ దేశపాండే స్థానంలో విద్వాత్ సెలక్ట్ అయ్యాడు.
ఇండియా ఏ: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబె, తనుష్ కొటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్, ప్రథమ్ సింగ్, అక్షయ్ వాద్కర్, షేక్ రషీద్, షామ్స్ ములాని, అకిబ్ ఖాన్.
ఇండియా బీ: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తీ , జగదీషన్, సుయాస్ ప్రభుదేశాయ్, రింకూ సింగ్, హిమాన్షు.
ఇండియా సీ: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిషేక్ పోరెల్, సూర్యకుమార్ యాదవ్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషాక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖాంబోజ్, హిమాన్షు చౌహన్, మయాంక్ మార్కండే, ఆర్యన్, సందీప్ వారియర్.
ఇండియా డీ: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ, యశ్ దూబె, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్, సరాన్ష్ జైన్, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య, హర్షిత్ రాణా, ఆకాష్ సేన్‌గుప్తా, కేస్ భరత్, సౌరభ్ కుమార్, సంజు శాంసన్, నిశాంత్ సిద్ధు, విద్వాత్ కవెరప్ప.