For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జూన్ 8న ఎంపీతో స్టార్ క్రికెటర్ ఎంగేజ్‌మెంట్.. పెళ్లి డేట్ ఇదే!

Rinku Singh: ఐపీఎల్ 2025 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిష్క్రమించింది. దీని తర్వాత కూడా జట్టులోని విధ్వంసరకర బ్యాటర్ రింకూ సింగ్ వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే.. రింకూ సింగ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. కొంతకాలం క్రితం రింకూ సింగ్ వివాహం గురించి చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు రింకూ సింగ్ నిశ్చితార్థం జూన్ 8న జరుగుతుందని తెలిసింది. ఎంపీ ప్రియా సరోజ్‌తో ఆయన నిశ్చితార్థం జరగనుంది. ఆమె మచ్లిషహర్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ.

జూన్ 8న రింకూ సింగ్‌ ఎంగేజ్‌మెంట్
జూన్ 8న ప్రియా సరోజ్‌తో ఎడమచేతి వా‌టం బ్యాటర్ రింకూ సింగ్ నిశ్చితార్థం జరగనుంది. ఇది లక్నోలో నిర్వహించబడుతుందని సమాచారం. ఈ కార్యక్రమంలో నగరంలోని 7 స్టార్ హోటల్‌లో జరగనున్నట్లు తెలిసింది. ప్రియా సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తూఫానీ సరోజ్ సన్నిహితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వివాహం సాంప్రదాయ ఆచారం ప్రకారం జరుగుతుంది. ప్రియా సరోజ్ ఎంపీ మాత్రమే కాకుండా ఆమె న్యాయవాది వృత్తిలో కూడా ఉన్నారు.

Rinku Singh Engagement on June 8 with MP Priya Saroj Wedding Date Confirmed

నవంబర్‌లో వివాహం
రింకూ సింగ్, ప్రియా సరోజ్ నవంబర్‌లో వివాహం చేసుకోనున్నారు. వారి వివాహం వారణాసిలో జరగనుంది. వారి పెళ్లి నవంబర్ 18న హోటల్ తాజ్‌లో జరుగుతుంది. ప్రియా సరోజ్ వయస్సు 26 సంవత్సరాలు. 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో ఆమె బీజేపీకి చెందిన బీపీ సరోజ్‌ను 35850 ఓట్ల తేడాతో ఓడించడం ద్వారా సమాజ్‌వాదీ పార్టీ తరఫున భారీ విజయం సాధించారు. రింకూ సింగ్ భారత జట్టు తరఫున 33 టీ20 మ్యాచ్‌లతో పాటు 2 వన్డేలు ఆడాడు.

రూ.13 కోట్లకు రీటైన్ చేసుకున్న కేకేఆర్
ఐపీఎల్ 2025 వేలానికి ముందు రింకూ సింగ్‌ను కేకేఆర్ అట్టిపెట్టుకుంది. కేకేఆర్ ఫ్రాంచైజీ అతడిని 13 కోట్లకు రీటైన్ చేసుకుంది. అంతకు ముందు రింకూ సింగ్ సీజన్‌కు రూ.55 లక్షలు పొందేవాడు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టాడు. అప్పటి నుంచి రింకూ సింగ్ పేరు మారుమోగింది. రింకూ సింగ్ టీమిండియాలో కూడా ఎంట్రీ పొందాడు.

Story first published: Sunday, June 1, 2025, 11:55 [IST]
Other articles published on Jun 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+