Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rinku Singh: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం!

Rinku Singh: టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(జిల్లా ప్రాథమిక విద్యా అధికారి)గా నియమించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొంతమందికి అస్సలు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో రింకూ సింగ్ నియామకంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

రింకూ సింగ్ నియామకంపై అభ్యంతరాలు
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్‌కు యూపీ సర్కారు కీలక బాధ్యత అప్పగించి బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా నియమించింది. అయితే రింకూ సింగ్ కేవలం 9వ తరగతి మాత్రమే పాస్ కావడంతో బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నియామకంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో రింకూ సింగ్‌ విజయాలను దృష్టిలో ఉంచుకొని క్రీడా కోటా కింద ఆయనను నియమించారు. దీనిపై విద్యా శాఖ డైరెక్టరేట్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ పతక విజేతల ప్రత్యక్ష నియామక నియమావళి-2022 ప్రకారం బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నియామకం జరిగిందని తెలిపింది. ఇప్పుడు మెడికల్, డాక్యుమెంట్స్ సమర్పించే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.

Rinku Singh Appointed as Basic Education Officer by UP Govt Public Raises Questions Over Qualification

సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం
యూపీ ప్రభుత్వం రింకూ సింగ్‌ను బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా నియమించడంపై కొంత మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. "ఇన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ తక్కువ చదువుకున్న వారే ఇప్పుడు అర్హులుగా ఉన్నట్లు అనిపిస్తుంది. డిగ్రీ-శిక్షణ ఉన్నప్పటికీ నిరుద్యోగి లాఠీ దెబ్బలు తింటున్నారు. తక్కువ చదువుకున్నవారు అధికారి పదవికి అర్హులుగా నిరూపించుకుంటున్నారు" అని రాసుకొచ్చాడు. "ఆయనను క్రీడా మంత్రిని చేసి ఉంటే బాగుండేది.. 9వ తరగతి పాస్ అయిన వ్యక్తిని బేసిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా చేయడం విద్యను అగౌరవపరచడమే" అని రాసుకొచ్చాడు.

రింకూ సింగ్ క్రికెట్ కెరీర్
రింకూ సింగ్ టీమిండియా తరఫున 2023లో ఐర్లాండ్ జట్టుపై తన టీ20 అరంగేట్రం చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. దీనితో పాటు రింకూ సింగ్ ఈ సంవత్సరం ఇంగ్లాండ్ జట్టుపై తన చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ బ్యాట్ నుంచి కేవలం 9 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు రింకూ సింగ్ భారత జట్టు తరఫున 33 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ టీ20 మ్యాచ్‌లలో మొత్తం 546 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్థ సెంచరీలు ఉన్నాయి. రింకూ సింగ్ వన్డే ఫార్మాట్‌లో టీమిండియా తరఫున తన అరంగేట్రం 2023లో దక్షిణాఫ్రికాపై చేశాడు. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ బ్యాట్ నుంచి 17 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు రింకూ సింగ్ భారత జట్టు తరఫున 2 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

Story first published: Thursday, June 26, 2025, 14:38 [IST]
Other articles published on Jun 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+