For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ టెస్టులకు రింకూ, తిలక్ వర్మకు పిలుపు.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

నయా ఫినిషర్ రింకూ సింగ్‌‌కు టెస్టు జట్టులో ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరగనున్న రెండు, మూడు అనధికారిక టెస్టులకు బీసీసీఐ 'ఇండియా-ఏ' జట్టును ప్రకటించింది. మూడో అనధికారిక టెస్టు జట్టులో యువ సంచలనం రింకూ సింగ్‌ కూడా ఉన్నాడు. రింకూతో పాటు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్ కూడా ఎంపిక అయ్యారు.

అఫ్గానిస్థాన్ సిరీస్‌లో రింకూ, సుందర్, అర్షదీప్ రాణించారు. ఆఖరి టీ20లో రోహిత్‌ శర్మతో కలిసి రింకూ సింగ్ జట్టును ఆదుకుని అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు. మరోవైపు తిలక్ వర్మ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టును నడిపిస్తున్నాడు. బ్యాటుతో చెలరేగతున్నాడు. కాగా, ఇంగ్లాండ్ జట్టుతో జరగనున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌ల్లో సత్తాచాటితే ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Rinku Singh and Tilak Varma called for England Tests. BCCI announced the team

జనవరి 25 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ ఉప్పల్ వేదికగానే జరగనుంది. అయితే తొలి రెండు టెస్టులకు మాత్రమే టీమిండియాను ప్రకటించారు. చివరి మూడు టెస్టులకు ఆటగాళ్లను ఇంకా ఎంపిక చేయలేదు. దాంతో ఇండియా-ఎ తరపున రాణించే ఆటగాళ్లకు భారత జట్టులో ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి.

సూపర్ ఫామ్‌లో ఉన్న రింకూ రెడ్ బాల్ క్రికెట్‌లోనూ సత్తాచాటితే టీమిండియా తరపున సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా అడుగుపెట్టవచ్చు. రింకూ ఇప్పటివరకు 15 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. మరోవైపు జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అతడి ఎంపిక దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ పరోక్షంగా వెల్లడించారు.

రెండో అనధికార టెస్టుకు 'భారత్ -ఎ' జట్టు : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్

మూడో అనధికార టెస్టుకు 'భారత్- ఎ' జట్టు : అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్

తొలి రెండు టెస్టులకు ఎంపికైన టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్

Story first published: Saturday, January 20, 2024, 9:50 [IST]
Other articles published on Jan 20, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+