Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rinku Singh-Priya Saroj: నిశ్చితార్థ వేడుకలో డ్యాన్స్‌తో అదరగొట్టిన ప్రియా సరోజ్(వీడియో)

Rinku Singh-Priya Saroj: భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్,సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ జూన్ 8న లక్నోలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కార్యక్రమంల 5 స్టార్ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులు హాజరయ్యారు. రింకూ సింగ్, ప్రియా సరోజ్ ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి వివాహం 5 నెలల తర్వాత నవంబర్ 18న వారణాసిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ కూడా హాజరయ్యారు.

రింకూ-ప్రియా డ్యాన్స్ వీడియో వైరల్
నిశ్చితార్థం సందర్భంగా రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ల అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒక వీడియో డ్యాన్స్‌కు సంబంధించింది కూడా ఉంది. స్టేజ్‌పైనే రింకూ సింగ్ , ప్రియా సరోజ్‌తో పాటు సన్నిహితులు డ్యాన్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రియా సరోజ్ డ్యాన్స్ చేస్తుండగా.. రింకూ సింగ్ నిశ్శబ్ధంగా నిలబడి ఉన్నాడు. రింకూ సింగ్ చుట్టూ నిలబడి ఉన్న అనేక మంది అతిథులు కూడా డ్యాన్లస్ చేశారు. ఈ నిశ్చితార్థానికి టీమిండియా మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, యూపీ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ కూడా హాజరయ్యారు.

Rinku Singh and Priya Saroj Engaged Viral Dance Video Steals the Show

అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ కూడా హాజరు
ప్రియా సరోజ్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ క్రమంలో వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ప్రొఫెసర్ రామ్‌గోపాల్, పుష్పేంద్ర సరోజ్, కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా, జయా బచ్చన్, శివపాల్ యాదవ్, తదితర రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అందరూ రింకూ, ప్రియా జంటను అభినందించారు. వారు అతిథులను పలకరించి వారితో ఫోటోలు దిగారు. ప్రియా సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ ఎస్పీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎంపీగా కూడా పని చేశారు.

రింకూ సింగ్ తెలుపు రంగు దుస్తుల్లో ఉన్నాడు. ప్రియా సరోజ్ గులాబీ రంగులో ఉన్న అందమైన దుస్తులు ధరించింది. ప్రియా స్టేజ్‌పైకి చేరుకోగానే ఆనందంతో ఏడ్చేసింది. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుతూ ఫోటోలు దిగారు. రింకూ సింగ్, ప్రియా సరోజ్ నిశ్చితార్థం కోసం ప్రత్యేకంగా ఉంగరాలు చేయించుకున్నారు. ప్రియా తనకి నచ్చిన డిజెైనర్ ఉంగరాన్ని కోల్‌కతా నుంచి కొనుగోలు చేసింది. రింకూ సింగ్ ముంబై నుంచి ప్రత్యేకంగా ఉంగరాన్ని తెప్పించాడు.

Story first published: Sunday, June 8, 2025, 20:40 [IST]
Other articles published on Jun 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+