Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఓ సినిమా.. అందులో క్రికెట్ ఉండదు: మాజీ ఆర్సీబీ స్టార్

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్, ఐపీఎల్‌లో గతంలో ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు ఆడిన రిలీ రోసో ఐపీఎల్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో క్వెట్టా గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా ఆడుతున్న రిలీ రోసో.. ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ చాలా బెటర్ అని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ అనేది ఓ క్రికెట్ టోర్నమెంట్ లాగా కాకుండా.. బాలీవుడ్ సినిమా లాగా కనిపిస్తుందని ఎద్దేవా చేశాడు.

సినిమా డ్రామా ఎక్కువ.. క్రికెట్ తక్కువ
ఐపీఎల్, పీఎస్ఎల్ మధ్య తేడాల గురించి అడిగిన ప్రశ్నకు రిలీ రోసో స్పందిస్తూ.. "ఐపీఎల్ అనేది చాలా సుదీర్ఘమైన టోర్నమెంట్. దాని వెనుక బాలీవుడ్ హంగా మొత్తం ఉంటుంది. అందుకే అది అసలైన క్రికెట్ మ్యాచ్ లాగా కాకుండా ఓ సినిమా లాగా అనిపిస్తుంది. కానీ పాకిస్థాన్ సూపర్ లీగ్ అలా కాదు.. ఇది చాలా తక్కువ సమయంలో ముగిసే టోర్నమెంట్, ఇక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది" అని రిలీ రోసో పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో గ్లామర్ ఎక్కువగా ఉంటుందని.. పీఎస్ఎల్‌లో మాత్రమే అసలైన క్రికెట్ సవాల్ ఉంటుందని రోసో చెప్పుకొచ్చాడు.

Rilee Rossouw Mocks IPL as Bollywood Movie Claims PSL is Better for Actual Cricket Drama

రిలీ రోసో ఐపీఎల్ ప్రయాణం
రిలీ రోసో ఐపీఎల్‌లో పలు సీజన్లలో భాగమయ్యాడు. 2014-15లో ఆర్సీబీ తరఫున ఆడిన రిలీ రోసో.. ఆ తర్వాత 2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు , 2024లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు ఆడి 473 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఐపీఎల్ వేలంలో ఆశించిన స్థాయిలో ధర లభించకపోవడం లేదా అవకాశాలు రాకపోవడంతో రిలీ రోసో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నాడని భారత క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

పీఎస్ఎల్‌లో రికార్డులు
ఐపీఎల్‌తో పోలిస్తే రిలీ రోసోకు పీఎస్ఎల్‌లో తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు 99 పీఎస్ఎల్ మ్యాచ్‌లు ఆడిన రిలీ రోసో.. త్వరలోనే 100 మ్యాచ్‌ల మైలురాయిని అందుకోబోతున్నాడు. ఈ లీగ్‌లో రిలీ రోసో 2366 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముల్తాన్ సుల్తాన్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ వంటి జట్లకు ఆడుతూ అక్కడ సూపర్ స్టార్‌గా ఎదిగాడు. అందుకే తనను ఆదిరిస్తున్న లీగ్ పట్ల విధేయత చూపిస్తూ ఐపీఎల్‌ను విమర్శిస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఐపీఎల్‌తో పోలిస్తే రిలీ రోసోకు పీఎస్‌ఎల్‌లో తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు 99 పీఎస్ఎల్ మ్యాచ్‌లు ఆడిన రోసో, త్వరలోనే 100 మ్యాచ్‌ల మైలురాయిని అందుకోబోతున్నాడు. ఈ లీగ్‌లో అతను 2366 పరుగులు సాధించాడు, ఇందులో 3 సెంచరీలు మరియు 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముల్తాన్ సుల్తాన్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ వంటి జట్లకు ఆడుతూ అక్కడ సూపర్ స్టార్‌గా ఎదిగాడు. అందుకే తనను ఆదరిస్తున్న లీగ్ పట్ల విధేయత చూపిస్తూ ఐపీఎల్‌ను విమర్శిస్తున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా పీఎస్ఎల్ ఆడే విదేశీ ఆటగాళ్లు ఇలాంటి కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, నాణ్యమైన లీగ్ అయిన ఐపీఎల్‌ను 'సినిమా'తో పోల్చడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

Story first published: Saturday, April 11, 2026, 11:19 [IST]
Other articles published on Apr 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+