205 పరుగుల భారీ టార్గెట్..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఏడు పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది ప్రొటీస్ టీమ్. కేప్టెన్ కమ్ ఓపెనర్ టెంబా బావుమా రెండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ నూరుల్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతే- మరో వికెట్ కోసం బంగ్లాదేశ్ బౌలర్లు తలకిందులుగా తపస్సు చేయాల్సి వచ్చింది.
బ్యాటింగ్‌లోనూ తడబాటు..
బంగ్లాదేశ్ జట్టు అటు బ్యాటింగ్‌లోనూ తడబడుతోంది. తొమ్మిది ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. గెలిచే అవకాశాలను చేజార్చుకున్నట్టే కనిపిస్తోంది. ఓపెనర్లు నజ్ముల్ హొస్సైన్ శాంటో-9, సౌమ్యా సర్కార్-15 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కేప్టెన్ షకీబుల్ హసన్ ఒక పరుగుకే వెనుదిరిగాడు. హఫీఫ్ హొస్సైన్‌దీ అదే దారి. మెహదీ హసన్ మీర్జా కూడా దక్షిణాఫ్రికా బౌలింగ్ అటాక్ ముందు నిలవలేకపోయాడు.
109 పరుగులు..
ఆ తరువాత కూడా అతని విజృంభణ కొనసాగింది. సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత ఎదుర్కొన్న తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. 109 పరుగులు చేసిన రొస్సొ షకీబుల్ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 170 పరుగుల వద్ద క్వింటన్ డికాక్ అవుట్ అయ్యాడు. 38 బంతుల్లో 63 పరుగులు చేసిన డికాక్ మూడు సిక్సర్లు ఏడు ఫోర్లు బాదాడు. హఫీఫ్ హొస్సైన్ బౌలింగ్‌లో సౌమ్యా సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి, వెనుదిరిగాడు.
ఆరేళ్ల తరువాత..
ఈ మ్యాచ్ మొత్తానికీ రిలీ రొస్సొ బ్యాటింగ్ హైలైట్. ఈ టీ20 ప్రపంచకప్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడీ టాప్ ఆర్డర్ బ్యాటర్. 56 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, ఏడు ఫోర్లతో 109 పరుగులు చేశాడు. ఆరేళ్ల తరువాత జట్టులో పునాగమనం చేశాడు రిలీ. చివరి ఏడు మ్యాచ్‌లల్లో సత్తా చాటాడు. పునరాగమనం తరువాత ఆడిన తొలి మ్యాచ్‌లో నాలుగు పరుగులే చేసిన ఆ తరువాత తనదైన శైలిలో చెలరేగాడు.
రెండు సున్నాలు.. రెండు సెంచరీ..
చివరి ఏడు టీ20 ఇంటర్నేషనల్స్‌లల్లో రిలీ రొస్సొ- 4, 96, 31, 0, 0, 100 (నాటౌట్), 109 పరుగులు చేశాడు. ఈ ఏడింట్లో 340 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 68. 184.78 స్ట్రైక్ రేట్‌తో పరుగులు పెట్టించాడు. రెండు బ్యాక్ అండ్ బ్యాక్ డకౌట్ల తరువాత.. అదే స్థాయిలో బ్యాక్ అండ్ బ్యాక్ సెంచరీలు బాదడం అంటే మాటలు కాదు. టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి దక్షిణాఫ్రికా ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు.


Click it and Unblock the Notifications












