వీడియో: స్టేడియంలో బార్బడొస్ బార్బీ డాల్: సెంచరీ హీరోకు ఫ్లయింగ్ కిస్..క్రిస్ గేల్‌కు హగ్!

చెస్టర్-లీ-స్ట్రీట్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా ఛెస్టర్ లీ స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌కు అనుకోని అతిథి హాజరయ్యారు. ఆమే- బార్బడోస్ సూపర్‌స్టార్ రిహానా. బార్బడొస్ వెండితెరపై తళుకులీనుతున్న స్టార్ నటి ప్లస్ సింగర్. టాప్ మోడల్ కూడా. సోమవారం శ్రీలంకతో రివర్‌సైడ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ను తిలకించడానికి ఆమె బార్బడొస్ నుంచి రెక్కలు కట్టుకుని చెస్టర్-లీ-స్ట్రీట్‌లో వాలిపోయారు. స్టేడియంలో సందడి చేశారు. అభిమానులతో సెల్ఫీ దిగారు. ఫొటోలకు ఫోజులిచ్చారు. వెస్టిండీస్ క్రికెటర్ల మ్యాచ్‌ను తిలకిస్తూ చాలాసేపు వీఐవీ బాక్స్‌లో గడిపారు. మ్యాచ్ మొత్తానికీ ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

సెంచరీ హీరోకు ఫ్లయింగ్ కిస్..క్రిస్ గేల్‌కు హగ్
మ్యాచ్ ముగిసిన అనంతరం క్రిస్ గేల్, బ్రేత్‌వైట్‌లను కలుసుకున్నారు. స్వయంగా ఆమె వెస్టిండీస్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. క్రిస్‌గేల్‌ను కలుసుకున్నారు. అతనితో ఫొటో దిగారు. వెస్టిండీస్ వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ నికొలస్ పూరన్ సిక్సర్‌తో సెంచరీ మార్క్‌ను అందుకున్న తరువాత.. అతనికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఆ సమయంలో ఆమె హావభావాలు అద్దిరిపోయాయి. రివర్‌సైడ్ స్టేడియంలో రిహానాను చూసిన తరువాత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సైతం ఉండబట్టలేకపోయాడు. ట్వీట్ చేశారు. స్టేడియంలో ప్రవేశిస్తున్న వీడియో క్లిప్‌ను తన ట్వీట్‌కు జత చేశారు. సరదాగా కామెంట్స్ చేశారు.

ఇంతా చేసినప్పటికీ..
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు పరాజయం పాలైంది. శ్రీలంక నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. లక్ష్యాన్ని ఛేదించడానికి వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లు అసాధారణంగా పోరాడారు. ప్రత్యేకించి- వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ నికొలస్ పూరన్ స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్ ఆడాడు. ఓ దశలో మ్యాచ్‌ను వెస్టిండీస్ వైపు తిప్పుకొన్నాడు కూడా. దురదృష్టం వెంటాడింది. లక్ష్యానికి చేరువగా వెళ్లిన సమయంలో పూరన్ అవుట్ అయ్యాడు. ఫలితంగా- మ్యాచ్ వెస్టిండీస్ చేజారింది.

కేరీర్‌లో తొలి సెంచరీ..
లంక నిర్దేశించిన 338 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడానికి వెస్టిండీస్ అసాధారణ పోరాట పటిమను ప్రదర్శించింది. విధ్వంసకారుడిగా పేరున్న క్రిస్‌గేల్ క్రీజులో లేడు. హార్డ్ హిట్టర్‌గా పేరున్న హెట్‌మెయిర్ త్వరగానే అవుటయ్యాడు. హఠాత్తుగా విరుచుకుని పడే కార్లొస్ బ్రేత్‌వైట్ రెండంకెల స్కోరు కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఈ పరిస్థితుల్లో ఒకే ఒక్కడు శ్రీలంక బౌలింగ్‌కు ఢీ కొట్టాడు. ఎదురొడ్డి నిలిచాడు. పట్టుదలగా ఆడాడు. విండీస్ సరికొత్త బ్యాటింగ్ సంచలనం నికొలస్ పూరన్.. 103 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications