Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వివాదాస్పద జడేజా రనౌట్‌పై విండిస్ కెప్టెన్ పొలార్డ్‌ ఏమన్నాడో తెలుసా?

 Right decision was made, that’s important: Pollard on Jadeja run-out call

హైదరాబాద్: భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఆదివారం చెన్నైలో జరిగిన తొలి వన్డేలో రవీంద్ర జడేజా వివాదాస్పద రనౌట్‌పై విండిస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ స్పందించాడు. రనౌట్‌పై అంతిమంగా సరైన నిర్ణయం తీసుకున్నారా? లేదా అనేదే తనకు ముఖ్యమని పొలార్డ్ చెప్పుకొచ్చాడు.

అసలేం జరిగింది?
48వ ఓవర్‌లో కీమో పాల్‌ వేసిన బంతిని జడేజా మిడ్‌ వికెట్‌ వైపు ఆడి సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోస్టన్‌ చేజ్‌ నేరుగా విసిరిన బంతి నాన్‌ స్ట్రయిక్‌ ఎండ్‌లోని వికెట్లను గిరాటేసింది. అప్పటికి జడేజా తన బ్యాట్‌ను క్రీజులో పెట్టలేదు. జడేజా క్రీజ్‌లోకి వచ్చాడని భావించిన ఫీల్డ్‌ అంపైర్‌ షాన్‌ జార్జ్‌ ఎటువంటి స్పందన ఇవ్వలేదు.

మైదానంలో ఉన్న మరో అంపైర్ కూడా

మైదానంలో ఉన్న మరో అంపైర్ కూడా

మైదానంలో ఉన్న మరో అంపైర్ కూడా జడేజా రనౌట్‌ విషయం గమనించకపోగా.. ఫీల్డర్లు కూడా అప్పీల్‌ చేయలేదు. అయితే అది ఔట్‌గా రిప్లేలో తేలడంతో పొలార్డ్‌ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు కాసేపు చర్చించాక.. థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశారు. థర్డ్‌ అంపైర్‌ జడేజాను ఔట్‌గా ప్రకటించాడు.

రీప్లేలో చూశాక ఫీల్డ్‌

రీప్లేలో చూశాక ఫీల్డ్‌

రీప్లేలో చూశాక ఫీల్డ్‌ అంపైర్‌ షాన్‌ మూడో అంపైర్‌ నిర్ణయాన్ని కోరడం ఎంత వరకు సమంజసమని వాదన వినిపిస్తోంది. మ్యాచ్ అనంతరం పొలార్డ్ మాట్లాడుతూ "రనౌట్‌పై అంతిమంగా సరైన నిర్ణయం తీసుకున్నారా లేదా అనేదే నాకు ముఖ్యం. విజయంలో హెట్‌మెయిర్ కీలక పాత్ర పోషించాడు" అని అన్నాడు.

కోహ్లీ సైతం తీవ్ర అసహనం

కోహ్లీ సైతం తీవ్ర అసహనం

మరోవైపు వివాదాస్పద జడేజా రనౌట్‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం తీవ్ర అసహనాన్ని ప్రదర్శించాడు. అంత సమయం వేచి చూశాక ఔట్‌ ఇవ్వడంపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి బౌండరీలైన్‌ దగ్గరికొచ్చి తన అసహనాన్ని వ్యక్తం చేసాడు.

ఔట్‌ అని థర్డ్‌ అంపైర్‌ తేల్చడంతో

ఔట్‌ అని థర్డ్‌ అంపైర్‌ తేల్చడంతో

ఈలోపే ఔట్‌ అని థర్డ్‌ అంపైర్‌ తేల్చడంతో.. జడేజా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక కోహ్లీ కూడా వెనక్కి వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే బుధవారం విశాఖపట్నం వేదికగా జరగనుంది.

Story first published: Monday, December 16, 2019, 12:15 [IST]
Other articles published on Dec 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+