చెత్త ఎంపిక ఆపండి: భారత్‌తో వన్డేలకు ఎంపిక చేసిన జట్టుపై వార్న్

హైదరాబాద్: టెస్టు సిరిస్ అనంతరం భారత్‌తో మూడో వన్డేల కోసం ఎంపిక చేసిన జట్టు చాలా చెత్తగా ఉందని స్పిన్ క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ పేర్కొన్నాడు. ఇకనైనా చెత్త ఎంపికలను ఆపేయాలని ఆస్ట్రేలియా క్రికెట్ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియా సెలక్టర్లు ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టులో పీటర్ సిడిల్, ఉస్మాన్ ఖవాజా, నాథన్ లియాన్‌ను తీసుకున్నారు.
చివరగా 2010లో వన్డేలాడిన సీనియర్ పేసర్ పీటర్ సిడిల్‌ను వన్డే సిరీస్‌కు ఎంపిక చేయడం ఆశ్చర్యకరం. టెస్టు ఆటగాళ్లయిన ఉస్మాన్ ఖవాజా, నాథన్ లియాన్‌లకు కూడా సెలక్టర్లు అవకాశమిచ్చారు. విధ్వంసక ఆటగాడు క్రిస్ లిన్‌తో పాటు ట్రావిస్ హెడ్, డార్సీ షార్ట్‌లపై వేటు వేశారు. దీంతో జట్టు ఎంపికపై షేన్ వార్న్ తన ట్విట్టర్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఆస్ట్రేలియా జట్టును చూశా
"ఇప్పుడే ఆస్ట్రేలియా జట్టును చూశా. అవమానకరంగా కొందరిని తొలగించారు. మరికొందర్ని ఎంపిక చేయడం చూస్తే ఏ మాత్రం ఆలోచించినట్టు లేదు. ఆస్ట్రేలియా క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో ఇలాంటి చెత్త ఎంపికలకు ముగింపు పలకాలి. డీఆర్సీ షార్ట్‌ను ఎందుకు తీసేశారో అర్థం కాలేదు. అతడేం తప్పు చేశాడో తెలియడం లేదు. బ్యాటు, బంతితో రాణించగలడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు" అని వార్న్ అన్నాడు.
జట్టు సమతూకంగా లేదు
"ఫించ్‌తో కలిసి టాప్ ఆర్డర్‌లో శుభారంభాలు అందించాడు. జట్టు సమతూకంగా లేదు. ఇప్పుడు ఎంపిక చేసిన ఆటగాళ్లు ఇంగ్లాండ్ పరిస్థితుల్లో ఎలా రాణిస్తారో చూడాలి. అక్కడి ఫ్లాట్ పిచ్‌లు కాస్త స్పిన్‌కు అనుకూలిస్తాయి. తెలివైన బౌలర్లు అవసరం. అక్కడ చిన్న మైదానాలు ఉంటాయి. అందుకే పవర్‌హిట్టింగ్ చేసే ఆటగాళ్లు కావాలి. ఫామ్‌లో లేని వారిని ఎంపిక చేసి బాగా ఆడుతున్న వారిని పక్కన పెట్టడం అస్సలు బాగాలేదు" అని వార్న్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

స్టార్క్, హేజిల్‌వుడ్, కమిన్స్‌కు విశ్రాంతి
అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ టెస్టు సిరీస్‌లో వరుసగా మ్యాచ్‌లు ఆడటంతో వారికి విశ్రాంతినిచ్చిన ఆస్ట్రేలియా.. పీటర్ సిడిల్, స్టాన్‌లేక్, స్టాయినిస్, రిచర్డ్‌సన్‌ని జట్టులోకి ఎంపిక చేసింది. ఇక టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా విఫలమైన అరోన్ ఫించ్ కెప్టెన్‌గా ఎంపికగా.. వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీకి అవకాశం దక్కింది. ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ దాదాపు 8ఏళ్ల తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా వన్డే జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.

జనవరి 12న సిడ్నీ వేదికగా తొలి వన్డే
ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో సీనియర్ ఆటగాళ్లకి సైతం ఆస్ట్రేలియా ఈ సిరీస్‌లో అవకాశమిచ్చింది. స్పిన్నర్ నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, షాన్ మార్ష్, మ్యాక్స్‌వెల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జనవరి 12న సిడ్నీ వేదికగా తొలి వన్డే.. ఆ తర్వాత అడిలైడ్ వేదికగా 15న రెండో వన్డే, 18న మెల్‌బోర్న్‌లో చివరి వన్డే జరగనుంది.

జట్ల వివరాలు:
ఆస్ట్రేలియా జట్టు:
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్ కోంబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్(వైస్ కెప్టెన్), అలెక్స్ క్యారీ(వైస్ కెప్టెన్), రిచర్డ్‌సన్, బిల్లీ స్టాన్‌లేక్, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, పీటర్ సిడ్డిల్, నాథన్ లియాన్, ఆడమ్ జంపా
టీమిండియా
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications