సూపర్ ఓవర్ కూడా టై: ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ఎలా ప్రకటిస్తారు?

హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన 2019 ప్రపంచకప్ విజేత ఎవరో తెలిసిపోయింది. ఆదివారం లార్డ్స్ వేదికగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఈ ఫైనల్‌కు ముందు వరకు మూడు ఫైనల్స్ ఆడిన ఇంగ్లండ్ జట్టు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే, ఆదివారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించి 44 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ గెలవాలన్న కలను నెరవేర్చుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, ప్లంకెట్ చెరో మూడు వికెట్లు తీయగా... జోఫ్రా అర్చర్, మార్క్ వుడ్ తలో వికెట్ తీసుకున్నారు.

242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్
అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది.

సూపర్ ఓవర్‌లోనూ మ్యాచ్ టై
అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సైతం ఆరు బంతుల్లో వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు ‘టై'గా ముగియడంతో ఆతిథ్య జట్టు అత్యధిక బౌండరీలు సాధించడంతో ఇంగ్లాండ్‌ను విశ్వ విజేతగా ప్రకటించారు.

బౌండరీ కౌంట్ నిబంధనను ఆధారంగా
అయితే, బౌండరీ కౌంట్ నిబంధనను ఆధారంగా విశ్వవిజేతను ప్రకటించడం 'హాస్యాస్పదంగా' ఉందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మండిపడ్డాడు. ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ టై అయిన తర్వాత ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించడం ఈ వరల్డ్‌కప్ ముందు వరకు ఉన్న నిబంధన.

మండిపడుతోన్న మాజీ క్రికెటర్లు
అయితే, ఈ ప్రపంచకప్‌లో ఆ నిబంధనను మార్చారు. ఐసీసీ నియమావళి ప్రకారం సూపర్ ఓవర్‌లో కూడా టై అయితే అత్యధిక బౌండరీలు బాదిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ఈ నిబంధనతోనే ఇంగ్లాండ్ విశ్వవిజేతగా అవతరించింది. ఈ నిబంధనపై క్రికెట్ విశ్లేషకులతో పాటు మాజీ క్రికెటర్లు ఐసీసీ తీరును తప్పుపట్టారు. ఈ నిబంధనపై గంభీర్ మాట్లాడుతూ ఈ తరహా విధానం సరైనది కాదని విమర్శించాడు. ఇదొక చెత్త రూల్ అంటూ మండిపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications