టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి క్రికెటేతర విషయాలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. తన కంటే పదేళ్లు పెద్ద అయిన టీవీ నటితో గిల్ పెళ్లికి సిద్ధమైనట్లు కథనాలు వస్తున్నాయి. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో గిల్ ప్రేమలో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా ప్రచారం జోరుగా సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
సారా-గిల్ ప్రేమ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుందని వార్తలు గట్టిగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా గిల్ మరొకరితో ప్రేమలో పడినట్లు, ఏకంగా పెళ్లి కూడా చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. హిందీ టెలివిజన్ నటి రిధిమా పండిట్‌తో గిల్ పెళ్లి పీటలక్కెనున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఈ 24 ఏళ్లు యువ ఓపెనర్ కంటే వయసులో రిధిమా పదేళ్లు పెద్ద.

బిగ్ బాస్ తొలి సీజన్ అనంతరం రిధిమా ఫేమస్ అయ్యారు. అయితే 'బహు హమారీ రజనీకాంత్' టీవీ షోతో రిధిమా ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది. ఇందులో ఆమె రోబోగా నటించి ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందింది. అయితే గిల్‌తో తాను ప్రేమలో ఉన్నట్లు, పెళ్లి చేసుకోనున్నట్లు వస్తున్న వార్తలపై రిధిమా రియాక్ట్ అయ్యారు. ఈ వార్తల్లో నిజం లేదని ఖండించారు. వ్యక్తిగతంగా గిల్‌తో పరిచయమే లేదని, తెలియదని అన్నారు.
"నా పెళ్లి గురించి కొందరు మీడియా వ్యక్తులు కాల్స్ చేస్తూ ఆరాతీస్తున్నారు. దీంతో దీనిపై స్పందించాల్సి వస్తుంది. పెళ్లేంటి? చేసుకోవడం ఏంటీ? ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన లేదు. అలాంటి సందర్భం వస్తే ఆ విషయాన్ని నేనే స్వయంగా తెలియజేస్తా'' అని రిధిమా పేర్కొన్నారు. కాగా, గిల్ దీనిపై స్పందించలేదు. ప్రస్తుతం గిల్ టీమిండియాతో కలిసి అమెరికాలో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్‌నకు గిల్ ఎంపికకానప్పటికీ రిజర్వ్ ప్లేయర్‌గా జట్టుతో కలిసి ఉంటున్నాడు. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు.