
హైదరాబాద్: ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఢిల్ డేర్ డెవవిల్స్‌కు ప్రధాన కోచ్ గా బాధ్యతలు నిర్వర్తించిన రికీ పాంటింగ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న పాంటింగ్.. ను అడిగిన ప్రశ్నకు కోహ్లీయేనని పేర్కొన్నాడు. ఒకే వేళ స్మిత్ బాల్ ట్యాంపరింగా కారణంగా జట్టుకు దూరం కాకపోయుంటే.. కచ్చితంగా స్మిత్ పేరే చెప్పి ఉండేవాడిని అని పేర్కొన్నారు.
రికీ పాంటింగ్ కూడా క్రికెట్ ఆడుతున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ బ్యాట్స్‌మన్ అని కూడా అనిపించుకున్నాడు. 56 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ పాంటింగ్ ఆ వయస్సులో అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకునేవాడు. స్మిత్ లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా బ్యాట్స్‌మెన్‌లలో కోహ్లీ ది బెస్ట్ అని చెప్పాడు. ఈ బాల్ ట్యాంపరింగ్ విషయాన్ని మినహాయించి అంతకుముందు ఆడిన 3-4ఏళ్ల క్రికెట్ ప్రస్తానంలో ప్రస్తావిస్తే. స్టీవ్ స్మిత్ యే ఉత్తమ ఆటగాడని చెబుతానని పేర్కొన్నాడు.
గతేడాది జరిగిన యాషెస్ సిరీస్‌లో స్మిత్ బాగా రాణించాడని, మంచి నాణ్యమైన ప్రదర్శన చేశాడని కొనియాడాడు. ఈ సిరీస్ మొదలైనప్పటి నుంచి ఒకేవిధంగా ఆడి అందరి మనస్సులు గెలుచుకున్నాడని గుర్తు చేశాడు. కాగా, స్మిత్ ప్రస్తుతం టొరెంటో నేషనల్స్ తరపున ఆడుతున్నాడు. టోరెంట్ వేదికగా జరుగుతున్న గ్లోబల్ కెనడా టీ20 లో ఆడుతున్నాడు.
విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్‌గా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. జట్టును ఏవిధంగా నడిపించాలి. తుది జట్టులో ఎంపికలు. వీటితో పాటుగా జట్టు విజయం కోసం స్థానం మార్చుకుని అయినా బ్యాటింగ్‌లో దిగేందుకు సిద్ధమైయాడు.