‘మంకీ గేట్ వివాదం’.. నా కెప్టెన్సీలోనే అంత్యంత హీనమైన ఘటన!!

Ricky Ponting says 2008 Monkeygate scandal lowest point of his captaincy

సిడ్నీ : 'మంకీ గేట్‌ వివాదం'గురించి తెలియని క్రికెట్‌ ప్రేమికులుండరంటే అతిశయోక్తి కాదు. భారత సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ ఆండ్రూ సైమండ్స్‌ల మధ్య మైదానంలో చోటుచేసుకున్న ఈ వివాదం అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. 2008 సిడ్నీ టెస్ట్‌లో చోటు చేసుకున్న ఈ వివాదస్పద ఘటనను అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ తాజాగా గుర్తు చేశాడు.

నేనేం చేయలేకపోయాను..

నేనేం చేయలేకపోయాను..

తన కెప్టెన్సీ కెరీర్‌లోనే ఈ వివాదం అత్యంత హీనమైన సంఘటనగా పాంటింగ్ అభివర్ణించాడు. ఈ వివాదం చోటుచేసుకున్న సమయంలో పరిస్థితులు తన అదుపులో లేవని స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

‘బహుశా మంకీ గేట్ వివాదం నా కెప్టెన్సీ కెరీర్‌లోనే అత్యంత హీనమైన ఘటన. 2005 యాషెస్ సిరీస్‌ ఓటమి కూడా కఠినమైనదే. కానీ ఈ సిరీస్ ఓటమి అనేది నా నియంత్రణలో జరిగింది. కానీ మంకీగేట్ వివాదం చోటుచేసుకున్నప్పుడు మాత్రం నేనేం చేయలేకపోయాను.'అని పాంటింగ్ తెలిపాడు.

ధోనీలా నిర్లక్ష్యం వద్దు.. నన్ను ఫాలో అవ్వండి: భజ్జీ

చాలా రోజులు వెంటాడింది..

చాలా రోజులు వెంటాడింది..

ఈ వివాదం తమను చాలారోజులు వెంటాడిందని, తుది నిర్ణయం కూడా తమని నిరాశకు గురిచేసిందన్నాడు. ‘ఇది చాలా రోజులు తమను వెంటాడింది. అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ కోసం మైదానంలోకి వస్తుండగా.. క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు నాతో మాట్లాడటం నాకింకా గుర్తుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ముగింపులో ఈ వివాదంపై విచారణ జరిగింది.'అని ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ‘ఈ మంకీగేట్ వివాదం తుది ఫలితంతో మేం తీవ్ర నిరాశకు గురయ్యాం. ఇది మా తదుపరి మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపింది. పెర్త్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లు గెలుస్తామనుకున్నాం. కానీ ఓటమి తప్పలేదు. ఆ తర్వాత మా పరిస్థితి మరింత దిగజారింది'అని పాంటింగ్ తెలిపాడు.

ఆ ఓటములు హర్ట్ చేశాయి..

ఆ ఓటములు హర్ట్ చేశాయి..

ఇక పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2005,2009, 2010-11 యాషెస్ సిరీస్‌లు ఓడింది. ‘తొలి రెండు యాషెస్ సిరీస్‌ల ఓటమైతే తమను తీవ్రంగా బాధించింది. ఎందుకంటే ఈ రెండు సిరీస్‌లు మేం గెలుస్తామనుకున్నాం'అని ఈ ఆసీస్ దిగ్గజం చెప్పుకొచ్చాడు.

మంకీ అన్నాడని...

మంకీ అన్నాడని...

2007-08 ఆస్ట్రేలియాలో పర్యటనలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్ట్‌లో హర్భజన్‌ తనను మంకీ అని జాతివివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆండ్రూ సైమండ్స్ మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో రిఫరీ హర్భజన్‌పై 50 శాతం మ్యాచ్ ఫీజు కోతతో పాటు మూడు టెస్ట్‌ల నిషేధం విధించాడు. అయితే వ్యవహారంలో భజ్జీ తప్పులేదని స్పష్టం చేసిన అప్పటి భారత్‌ ఆటగాళ్లు.. నిషేధం ఎత్తేయకపోతే సిరీస్‌ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు. అప్పీల్స్ కమిషనర్ జాన్ హనెసన్ ముందు హర్భజన్‌కు సచిన్ మద్దతుగా నిలవడంతో, అతను ఈ శిక్షను రద్దు చేశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, March 18, 2020, 16:11 [IST]
Other articles published on Mar 18, 2020
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more