పాంటింగ్ జోస్యం: టాప్ స్కోరర్ కోహ్లీ కాదు, 2-1తో ఆసీస్ గెలుస్తుంది

హైదరాబాద్: సొంతగడ్డపై టీమిండియాతో జరగబోయే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఆస్ట్రేలియా 2-1తో గెలుస్తుందని ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబర్ 6న అడిలైడ్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా పాంటింగ్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియా పిచ్‌లు ప్రత్యేకం. ప్రత్యర్ధి జట్ల బౌలర్లను ఆసీస్ బ్యాట్స్‌మెన్ సమర్ధవంతంగా ఎదుర్కొనగలరు. దీంతో పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లు ఉన్న అడిలైడ్, పెర్త్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా గెలిచే అవకాశం ఉంది. రెండు జట్ల బౌలింగ్ బాగుందని, ఎవరు బ్యాటింగ్ బాగా చేస్తారో వాళ్లే గెలుస్తారు" అని పాంటింగ్ స్పష్టం చేశాడు.

ఇప్పటివరకు టెస్టు సిరిస్‌ను గెలవలేదు
"గత 40 ఏళ్లుగా ఇండియా ఆస్ట్రేలియాకు వస్తున్నా.. ఇప్పటివరకు టెస్టు సిరిస్‌ను గెలవలేదు. ఇక్కడి బౌన్సీ పిచ్‌లపై భారత జట్టు బోల్తా పడుతూనే ఉంది. ఈసారి అలాగే జరగాలని అనుకుంటున్నా" అని రికీ పాంటింగ్ అన్నాడు. అంతేకాదు ఈ సిరిస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచేది విరాట్ కోహ్లీ కాదని, ఉస్మాన్ ఖవాజా అని పాంటింగ్ అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై గత 40 ఏళ్లలో టీమిండియా 11సార్లు టెస్ట్ సిరీస్‌ను ఆడినప్పటికీ ఒక్కసారి కూడా నెగ్గలేదు.

మొత్తం 44 టెస్టులాడి కేవలం టీమిండియా
అంతేకాదు ఆసీస్ గడ్డపై మొత్తం 44 టెస్టులాడి కేవలం టీమిండియా కేవలం ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక, ఈ సిరిస్‌లో బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ రాణించనున్నట్లు పాంటింగ్ తెలిపాడు. మునుపటితో పోలిస్తే ఇప్పుడు భారత్ జట్టు మంచి సమతూకంతో ఉండటం, మరోవైపు డేవిడ్ వార్నర్, స్టీవ్‌స్మిత్ లేకపోవడంతో ఆసీస్ జట్టు బలహీనంగా కనిపిస్తుండటతో.. కోహ్లీసేన కచ్చితంగా ఈ టెస్టు సిరీస్ గెలుస్తుందని భారత మాజీ క్రికెటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

జోస్యం చెప్పిన పాంటింగ్
అయితే, పాంటింగ్ మాత్రం ఇందుకు భిన్నంగా జోస్యం చెప్పాడు. అంతేకాదు ఆసీస్ గడ్డపై టీమిండియా గత రికార్డులను చూస్తే పరిశీలిస్తే అతడి వాదనలో నిజం ఉందని అభిమానులు అంటున్నారు. గతంలో యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 0-4తో కోల్పోతుందని పాంటింగ్ చెప్పాడు. సరిగ్గా అలాగే ఇంగ్లాండ్ జట్టు 0-4తో యాషెస్ సిరిస్‌లో ఓటమిపాలైంది.

గత పర్యటనలో నాలుగు సెంచరీలు బాదిన కోహ్లీ
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో టీమిండియా గత రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. 2003-04లో సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని టీమిండియా సిరీస్‌ని డ్రాగా ముగించగా ఆ తర్వాత 2003-04లో ధోని నాయకత్వంలో సిరీస్‌ని 1-2తో చేజార్చుకుంది. మళ్లీ ధోని నాయకత్వంలోని టీమిండియా 2014-15 ఆసీస్ పర్యటనలో 0-2తో ఓడిపోయింది. అయితే, ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ ఏకంగా 4 సెంచరీలు సాధించినప్పటికీ, జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications