Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెరీర్​లో నేను ఎదుర్కొన్న బెస్ట్ ఓవర్ అదే: పాంటింగ్

Ricky Ponting reveals ‘the best over’ he ever faced

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన కెరీర్​లో ఎదుర్కొన్న బెస్ట్ ఓవర్ గురించి తాజాగా చెప్పాడు. 2005 యాషెస్ సిరీస్​లో భాగంగా ఎడ్జ్​బాస్టన్ టెస్ట్​లో ఇంగ్లండ్ ఆల్​రౌండర్ అండ్రూ ఫ్లింటాఫ్ వేసిన ఓ ఓవర్ తాను ఎదుర్కొన్న వాటిలో బెస్ట్ ఓవర్ అని తెలిపాడు. అటు బ్యాట్స్‌మన్‌గా ఇటు కెప్టెన్‌గా పాంటింగ్ ఆసీస్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించాడు. పాంటింగ్ ఆసీస్ తరఫున 168 టెస్టులు, 375 వన్డేలు, 17 టీ20లు ఆడాడు.

బెస్ట్ ఓవర్ అదే

బెస్ట్ ఓవర్ అదే

2005 యాషెస్ సిరీస్ జ్ఞాపకంగా అండ్రూ ఫ్లింటాఫ్ వేసిన ఓ ఓవర్ వీడియోను ఇంగ్లండ్​ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి రికీ పాటింగ్​ శుక్రవారం స్పందించాడు. 'నేను ఎదుర్కొన్న బెస్ట్ ఓవర్ ఇదే. గంటకు 90మైళ్ల వేగంతో క్లాస్ రివర్స్ స్వింగ్​' అని రికీ రిప్లై ఇచ్చాడు. తన కెరీర్​లో 2005 యాషెస్ బెస్ట్ సిరీస్​ అని పాంటింగ్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాంటింగ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 2005,2009, 2010-11 యాషెస్ సిరీస్‌లు ఓడింది.

బోల్తా కొట్టించిన ఫ్లింటాఫ్:

బోల్తా కొట్టించిన ఫ్లింటాఫ్:

ఎడ్జ్​బాస్టన్ టెస్ట్​లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు చేసింది. ఆపై ఆస్ట్రేలియా 308 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో షేన్ వార్న్ మాయ చేయడంతో ఇంగ్లండ్ కేవలం 182 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ లక్ష్యం 282 పరుగులుగా మారింది. ఆసీస్ ఓపెనర్లు 47 పరుగుల చేసి శుభారంభం అందించారు. ఫ్లింటాఫ్ తన తొలి ఓవర్లోనే ఆస్ట్రేలియాను దెబ్బ కొట్టాడు. ఆపై పాంటింగ్ క్రీజులోకి రాగా అద్భుతంగా బౌలింగ్ చేసిన ఫ్లింటాఫ్.. చివరి బంతిని అతన్ని పెవిలియన్ చేర్చాడు. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో ఇంగ్లండ్ కేవలం 2 పరుగుల తేడాతో గెలిచింది.

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌:

అత్యంత విజయవంతమైన కెప్టెన్‌:

బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా పాంటింగ్ ఆసీస్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించాడు. అతని సారథ్యంలో కంగారుల జట్టు 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు 2006 చాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. వన్డే ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కూడా పాంటింగ్‌ గుర్తింపు పొందాడు. 228 మ్యాచ్‌ల్లో అతని సారథ్యంలో ఆసీస్ ఏకంగా 162 గెలుపొందింది. ఇక సంప్రదాయక ఫార్మాట్‌లో కూడా అద్భుత విజయాలు సాధించింది. 77 టెస్ట్ మ్యాచ్‌ల్లో 48 గెలుపొందింది.

అనూహ్యంగా కెప్టెన్సీకి వీడ్కోలు:

అనూహ్యంగా కెప్టెన్సీకి వీడ్కోలు:

డిఫెండింగ్ చాంపియన్‌ హోదాలో 2011 ప్రపంచకప్ బరిలోకి దిగిన పాంటింగ్ సేన ఆతిథ్య భారత్ చేతిలో క్వార్టర్ ఫైనల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మెగా టోర్నీ ఓటమి అనంతరం పాంటింగ్ అనూహ్యంగా తన కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. దీంతో మైఖెల్ క్లార్క్ ఆసీస్ జట్టు పగ్గాలందుకున్నాడు. అప్పట్లో ఇది పెద్ద చర్చనీయాంశమైంది.

Story first published: Friday, April 10, 2020, 14:04 [IST]
Other articles published on Apr 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+