
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురించాడు. కోహ్లీ తన జట్టును బాగా నడిపించాడని చెప్పాడు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవడం అద్భుతమని అన్నాడు. ఇంత మంచి వైట్ బాల్ క్రికెటర్‌ని మళ్లీ చూడలేమని తెలిపాడు. అతని రికార్డులు అద్భుతంగా ఉన్నాయని అని రికీ పాంటింగ్ విరాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తాడు. అక్టోబరు 17, సోమవారం గబ్బాలో జరిగిన ఆస్ట్రేలియా, భారత్ వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
అద్భుతమైన ఫీల్డింగ్
టిమీండియా టీ20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత, వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి రెండు ఎగ్జిబిషన్ మ్యాచులకు కోహ్లీ దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో అధికారిక వార్మప్ మ్యాచ్ లో కోహ్లీ ఫీల్డింగ్ లో అద్బుతంగా రాణించాడు. 13 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై దాదాపు సెంచరీ చేశాడు.

అక్టోబర్ 23
ఆ రోజు నుంచి కోహ్లీ బ్యాట్‌తో మంచి టచ్‌లో ఉన్నాడు. భారత్ బుధవారం న్యూజిలాండ్ తో రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది.అక్టోబర్ 23 ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఇండియా తలపడనుంది. మొన్న జరిగిన ఆసియా కప్ లో రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. గ్రూప్ దశ తొలి గేమ్‌లో భారత్ గెలుపొందగా, సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది.