క్రీజుకు అడుగుదూరంలో బౌలింగ్ చేస్తుంటే గమనించరేం: పాంటింగ్

న్యూ ఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ల తీరుపై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మండిపడ్డాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ క్రీజు వెలుపల కాలు పెట్టి బంతి విసిరినా అంపైర్ గమనించకపోవడాన్ని దుయ్యబట్టిన పాంటింగ్.. సుదీర్ఘకాలంగా టెస్టుల్లో ఈ తప్పులు జరుగుతున్నాయని ఆరోపించాడు.
ఇషాంత్ విసిరిన బంతి ఫ్యాడ్స్‌ని తాకడంతో
ఆటలో నాలుగోరోజైన ఆదివారం భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడింది. ఆ తర్వాత 323 పరుగుల లక్ష్యఛేదనకి దిగిన ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ ఆరోన్ ఫించ్ తొలి ఓవర్ రెండో బంతికే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఇషాంత్ విసిరిన బంతి అరోన్ ఫించ్ ఫ్యాడ్స్‌ని తాకడంతో.. ఔట్ కోసం భారత్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ల కుమార ధర్మసేన వేలెత్తేశాడు. అంపైర్ నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేసిన ఆరోన్ ఫించ్ డీఆర్‌ఎస్ కోరాడు.
కొద్దిసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో
దీంతో రిప్లైలో ఇషాంత్ శర్మ నోబాల్‌గా విసిరినట్లు తేలింది. ఇలా ఫించ్‌కి లైఫ్ లైన్ లభించింది. కానీ, ఆ తర్వాత కొద్దిసేపటికే అశ్విన్ బౌలింగ్‌లో మళ్లీ ఫించ్‌ని అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. రిప్లైలో నాటౌట్ అని తేలింది. అయితే.. రెండోసారి డీఆర్‌ఎస్ అడిగేందుకు ఇష్టపడని ఫించ్ పెవిలియన్‌కి వెళ్లిపోయాడు.

నోబాల్స్‌ని పసిగట్టడంలో కొన్నేళ్లుగా
‘అంపైర్లు క్రీజు నోబాల్స్‌ని పసిగట్టడంలో విఫలమవుతున్నారని కొన్నేళ్లుగా చెప్తూనే ఉన్నా. అడిలైడ్‌లో ఇషాంత్ శర్మ క్రీజు వెలుపల కాలు పెట్టి బంతి విసిరినా.. గమనించలేకపోయారు. ఫాస్ట్ బౌలర్ బంతి విసిరే సమయంలో ఆ నోబాల్స్‌ని గుర్తించడం కష్టమే. కానీ.. మరీ క్రీజుకి అడుగు దూరం వెలుపల కాలు పెట్టినా గమనించలేకపోవడం ఏంటి..? ' అని పాంటింగ్ ప్రశ్నలు గుప్పించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications