Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫ్యాబ్-4 కాదు.. ఆ కుర్రాడే అత్యుత్తమ ప్లేయర్: రికీ పాంటింగ్

దశాబ్దానికిపైగా సత్తాచాటిన విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, జో రూట్, స్టీవ్ స్మిత్‌ల‌ను క్రికెట్ ప్రపంచం ఫ్యాబ్-4గా పిలుస్తుంటుంది. అత్యుత్తమ క్రికెటర్ అనే ప్రశ్నకు ఈ నలుగురిలో ఒక్కరి పేరే అత్యధికంగా జవాబుగా వినిపిస్తుంటుంది. అంతటి రీతిలో క్రికెట్ క్షేత్రంలో ఈ యోధులు సత్తాచాటారు. అయితే ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అత్యుత్తమ క్రికెటర్‌ అంటూ కుర్రాడు పేరు చెప్పాడు.

ప్రస్తుతం టెస్టుల్లో అత్యుత్తమ క్రికెటర్ ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఫ్యాబ్-4 కాకుండా తొలిసారి కొత్త పేరు తెరపైకి వచ్చింది. 25 ఏళ్ల ఇటీవల బ్రూక్ ఇటీవల టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. జులై నుంచి టెస్టుల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్న జో రూట్‌ను అధిగమించి ఒక్క పాయింట్ ఆధిక్యంతో బ్రూక్ అగ్రస్థానానికి చేరాడు.

Ricky Ponting Hails 25-Year-Old Harry Brook as the Best Test Batsman Today

''ప్రస్తుత టెస్టు బ్యాటర్లలో హ్యారీ బ్రూక్ అత్యుత్తమ ప్లేయర్‌గా భావిస్తున్నా. అతను చక్కని ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. సొంతగడ్డతో పాటు విదేశాల్లో గొప్ప ప్రదర్శన చేస్తున్నాడు. అతను సాధించిన ఎనిమిది-తొమ్మిది సెంచరీల్లో విదేశాల్లో ఏడు శతకాలు విదేశాల్లోనే బాదడం విశేషం. అతను పరుగులు సాధించే విధానం, క్లాస్‌ను ఎంతో ఆస్వాదిస్తున్నాను. జనరేషనల్ ప్లేయర్ అయిన అతన్ని గత ఐపీఎల్ వేలంలో దక్కించుకున్నాను. ప్రస్తుత టెస్టు ఫార్మాట్‌లో సత్తాచాటుతున్న బ్రూక్ అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టగలడు'' అని రికీ పాంటింగ్ అన్నాడు.

గత కొంతకాలంగా అద్భుత ఫామ్‌ కొనసాగిస్తున్న హ్యారీ బ్రూక్ శతకాలు సాధిస్తున్నాడు. 23 టెస్టులు ఆడిన బ్రూక్ 61.62 సగటుతో 2280 పరుగులు చేశాడు. ఎనిమిది సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఓ డబుల్ సెంచరీ కూడా బాదాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ల నుంచి బ్రూక్ ప్రశంసలు అందుకుంటున్నాడు. గత ఐపీఎల్ వేలంలో బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. అప్పటి ఢిల్లీ కోచ్‌గా పాంటింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, December 12, 2024, 17:24 [IST]
Other articles published on Dec 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+