న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని లేకపోవడం వల్లే ఆస్ట్రేలియా చేతిలో కోహ్లీసేన ఓటమి: పాంటింగ్

MS Dhoni's Calmness Is 'Invaluable' For Team india,Says Ricky Ponting | Oneindia Telugu
Ricky Ponting feels absence of invaluable MS Dhoni resulted in Virat Kohli-led Indias defeat to Australia

హైదరాబాద్: మైదానంలో ఆటగాళ్లంతా ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోని ప్రశాంతంగా ఉంటూ జట్టును ముందుకు నడిపించే తీరు వెలకట్టలేమని ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ అన్నాడు. మార్చి 23 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 సీజన్‌కు తెరలేవనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కోచ్‌గా వ్యవహరిస్తున్న రికీ పాంటింగ్‌ ఆదివారం ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోని గురించి పలు విషయాలు పంచుకున్నాడు.

నెట్ ప్రాక్టీస్ లో అదర గొట్టిన ధోనీ: ఐపీఎల్ మ్యాచుల్లో బౌలర్లకు చుక్కలే!నెట్ ప్రాక్టీస్ లో అదర గొట్టిన ధోనీ: ఐపీఎల్ మ్యాచుల్లో బౌలర్లకు చుక్కలే!

ప్రస్తుతం ధోనీ కెప్టెన్సీకి దూరంగా ఉన్నప్పటికీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీకి విలువైన సలహాలు ఇస్తున్నాడని అన్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌ను 2-3 తేడాతో టీమిండియా చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

ధోని లేకపోవడం

ధోని లేకపోవడం

ఈ మ్యాచ్‌లో ధోని లేకపోవడం కూడా సిరీస్‌ ఓటమికి ఓ కారణమని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. వన్డేల్లో భారత్‌ ఒత్తిడిని జయించలేకపోతోందని.. ఒత్తిడి జయించడంలో ప్రస్తుతం భారత్‌కు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ధోనీయేనని పాంటింగ్ అన్నాడు. వరల్డ్‌కప్‌ బెర్తు కోసం ఆకట్టుకోవాలన్న ఆలోచనతో ఆడితే ఆటలో రాణించలేమని అన్నాడు.

సమతూకంగా ఢిల్లీ క్యాపిటల్స్‌

సమతూకంగా ఢిల్లీ క్యాపిటల్స్‌

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఈసారి సమతూకంగా ఉందని.. శిఖర్‌ ధావన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడని అన్నాడు. పృథ్వీ షా, రిషభ్‌ పంత్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ వంటి యువ క్రికెటర్లు జట్టులో ఉండటం చక్కటి పరిణామం అని అన్నాడు. కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించడం సవాల్‌తో కూడుకున్నదని పాంటిగ్ చెప్పుకొచ్చాడు.

కొత్త జెర్సీతో ఢిల్లీ క్యాపిటల్స్

కొత్త జెర్సీతో ఢిల్లీ క్యాపిటల్స్

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఐపీఎల్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఢిల్లీ ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలివలేదు. కనీసం ఫైనల్‌కు కూడా చేరలేదు. దీంతో ఈ సారి కచ్చితంగా విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఆ జట్టు యాజమాన్యం గట్టి పట్టుదలతో ఉంది.

మార్చి 24న వాంఖడేలో ముంబైతో ఢిల్లీ తొలి మ్యాచ్

మార్చి 24న వాంఖడేలో ముంబైతో ఢిల్లీ తొలి మ్యాచ్

ఐపీఎల్ 2019 సీజన్ షెడ్యూల్‌ని ఇప్పటికే బీసీసీఐ విడుదల చేసింది. అయితే కేవలం 17 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించడం విశేషం. మార్చి 24న వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. మార్చి 23న టోర్నీ ప్రారంభం కానుంధి. ఐపీఎల్ 2019 సీజన్‌ తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.

తొలి మ్యాచ్ ఆదాయం మొత్తం అమరజవాన్ల కుటుంబాలకే

తొలి మ్యాచ్ ఆదాయం మొత్తం అమరజవాన్ల కుటుంబాలకే

తమ సొంతగడ్డపై జరిగే తొలి మ్యాచ్ ఆదాయాన్ని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు విరాళంగా ఇస్తామని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది.

Story first published: Monday, March 18, 2019, 10:29 [IST]
Other articles published on Mar 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X