ధోనీతో పోలిస్తే నాలో ఆ ముఖ్య లక్షణం లేదు.. మహీలా ప్రయత్నించి విఫలమయ్యా: పాంటింగ్

సిడ్నీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫీల్డ్‌లో తన భావోద్వేగాలను ఎప్పుడూ అదుపులో ఉంచుకుంటాడని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ అన్నాడు. ధోనీకి, తనకు ఎంతో వ్యత్యాసం ఉందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. మహీ నాయకత్వంలో ఆటగాళ్లు ఎంతో స్వేచ్ఛగా ఆడేవారని పేర్కొన్నాడు. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్ ఓటమి తర్వాత ధోనీ మైదానంలోకి దిగలేదు. ఇక ఆగస్టు 15న అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

ధోనీలా ప్రయత్నించి విఫలమయ్యా:
తాజాగా రికీ పాంటింగ్ న్యూస్.కామ్.ఏయూతో మాట్లాడుతూ ఎంఎస్ ధోనీ ఎందుకంత విజయవంతమైన కెప్టెన్ అయ్యాడో చెప్పుకొచ్చాడు. 'ఫీల్డ్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన భావోద్వేగాలను ఎప్పుడూ అదుపులో ఉంచుకుంటాడు. అది అతడిలోని ఓ ఉత్తమ గుణం. అలా ఉండేందుకు నేను ఎన్నోసార్లు ప్రయత్నించా. కానీ నాకు సాధ్యం కాలేదు. నేను ఎప్పుడూ పూర్తి కంట్రోల్‌లో లేను. మ్యాచ్ ఆసాంతం అలా ఉండడం చాలా కష్టం. ఏదో ఒక సమయంలో సారథి సహనం, ఓర్పు కోల్పోతాడు. మహీకి ఎలా సాధ్యం అయిందో ఆ దేవుడికే తెలియాలి' అని రికీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

టీమిండియా ఎప్పుడూ గెలిచేలాగే కనిపించేది:
'ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ఎప్పుడూ గెలిచే లాగే కనిపించేది. ప్లేయర్లు అందరూ స్వేచ్ఛగా ఆడుతూ చెలరేగిపోయేవారు. జట్టు సభ్యుల్లో దాగిఉన్న పూర్తిస్థాయి ప్రతిభను వెలికితీసేందుకు ధోనీ నిరంతరం ప్రయత్నిస్తుండేవాడు. ఒక్కో ఆటగాడికి నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చేవాడు. ఆటగాడికి ఎప్పుడూ మద్దతు ఇచ్చేవాడు. ధోనీ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం వల్లే అతడిని టీం మేట్స్ ఎక్కువగా ఇష్టపడేవాళ్లు' అని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ తెలిపాడు.

భారత్‌లో చాలా సమయం గడుపుతున్నా:
'రిటైర్మెంట్ అనంతరం భారత్‌లో చాలా సమయం గడుపుతున్నాను. అందుకు కారణం ఐపీఎల్. భారత మాజీ సారథికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి నాకు తెలుసు. నేను ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు అభిమానులు ధోనీ గురించి మాట్లాడుకోవడంచాలాసార్లు విన్నాను. అతడి నాయకత్వం, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే అతడి తత్వం గురించి అభిమానులు చర్చించుకునేవారు' అని రికీ తెలిపాడు. ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుతో తలపడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ అయినా పాంటింగ్ పేర్కొన్నాడు.

మూడు ఐసీసీ ట్రోఫీలు:
రికీ పాంటింగ్ నేతృత్యంలో ఆస్ట్రేలియా జట్టు వరుసగా రెండు ప్రపంచకప్‌లను గెలుచుకుంది. 2003, 2007 ప్రపంచకప్‌లను ఆసీస్ గెలుచుకుంది. మరోవైపు మూడు ఐసీసీ ట్రోఫీలను ఎంఎస్ ధోనీ టీమిండియాకు అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్ ట్రోఫీలు అందిన ఏకైక నాయకుడిగా ధోనీ నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
రీఎంట్రీపై కన్నేసిన రాబిన్ ఉతప్ప!!