Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అదంతా పాకిస్థాన్ వల్లే.. :రికీ పాంటింగ్

IPL 2025: పంజాబ్ కింగ్స్ జట్టులో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు గాయపడ్డారు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని జట్టు వారి స్థానంలో ఆటగాళ్లను కనుగొనలేకపోయింది. దీనికి కారణం పాకిస్థాన్ అని.. ఐపీఎల్‌లో ఆటగాళ్ల భర్తీలో పాకిస్థాన్ అడ్డంకులు సృష్టిస్తోందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి పాకిస్థాన్ సూపర్ లీగ్ అంటే పీఎస్ఎల్ కారణంగా జట్లు విదేశీ ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను కనుగొనలేకపోతున్నాయి. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ అంగీకరించారు.

పంజాబ్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. తాజాగా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. విదేశీ ఆటగాళ్లందరూ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో బిజీగా ఉండటంతో పంజాబ్ కింగ్స్ ఈ ఆటగాళ్లకు ప్రత్యామ్నాయాలను కనుగొనలేకపోతున్నారు. అందుకే పంజాబ్ కింగ్స్‌కు అవసరమైన ప్రత్యామ్నాయ ఆటగాళ్లు పాకిస్థాన్ సూపర్ లీగ్ లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు యువ భారత ఆటగాళ్లతో వెళ్లవలసి వస్తుంది.

Ricky Ponting Blames Pakistan and PSL for Foreign Player Shortage in IPL 2025

అయితే పంజాబ్ కింగ్స్ ఇంకా లాకీ ఫెర్గూసన్, మ్యాక్స్‌వెల్ స్థానంలో ఎవరినీ ప్రకటించలేదు. కానీ ఆటగాళ్లు జట్టుతో ప్రయాణిస్తున్నారని కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించారు. సీఎస్కేతో జరిగిన మ్యాచ్ తర్వాత రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. తాము ఇంకా ఆటగాళ్ల భర్తీపై నిర్ణయం తీసుకోలేదని.. కానీ మా జట్టు మనస్తత్వం, మా ప్లేయింగ్ ఎలెవన్ తో బలంగా ఉన్నామన్నారు. మ్యాచ్‌లను గెలిపించగల ఆటగాళ్లు మా వద్ద ఉన్నారన్నాడు. కాబట్టి వీలైనంత వరకు ఆ ప్రణాళికకు కట్టుబడి ఉంటామని చెప్పాడు.

త్వరలోనే కొంత మంది ఆటగాళ్ల భర్తీపై ఆలోచిస్తామని రికీ పాంటింగ్ ధ్రువీకరించాడు. ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి నాణ్యమైన ఎంపికలు లేకపోవడానికి పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)నే కారణమని రికీ పాంటింగ్ నిందించాడు. మ్యాక్స్‌వెల్ , లాకీ ఫెర్గూసన్ జట్టు నుంచి తొలగిపోయారని.. ఇదే సమయంలో పాకిస్థాన్ సూపర్ జరుగుతుండడంతో వారి స్థాయిలో ఆడే ఆటగాళ్లు అందుబాటులో లేరన్నాడు. భారతీయ ఆటగాళ్లను పరిశీలిస్తున్నామని రికీ పాంటింగ్ తెలిపాడు. కొంత మంది భారత యువ ఆటగాళ్లను ధర్మశాలకు తీసుకెళ్తామని.. వారిని నిశితంగా పరిశీలిస్తామన్నారు. పరిశీలించిన అనంతరం వారు పంజాబ్ కాంట్రాక్టును పొందవచ్చన్నాడు.

Story first published: Thursday, May 1, 2025, 17:38 [IST]
Other articles published on May 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+