Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పంత్‌కు బ్యాకప్‌ వికెట్‌కీపర్‌గా అలెక్స్‌ కారీ!!

Ricky Ponting backs Alex Carey to win games for Delhi Capitals

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆస్ట్రేలియా వికెట్‌కీపర్‌ అన్ని విధాలుగా ఉపయోగపడుతాడని ఆ జట్టు ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ అన్నాడు. అలెక్స్‌ కారీ ఢిల్లీకి మ్యాచ్‌లు గెలిపించగలడు. రిషభ్‌ పంత్‌కు బ్యాకప్‌ వికెట్‌కీపర్‌గా కూడా ఉంటాడు అని పాంటింగ్‌ అంటున్నాడు.

24 బంతుల్లో 55 పరుగులు

24 బంతుల్లో 55 పరుగులు

అలెక్స్‌ కారీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్)లో అడిలైడ్‌ స్ట్రైకర్స్‌ తరఫున ఆడుతున్నాడు. అడిలైడ్‌ బ్యాటింగ్ లైనప్ నాలుగో స్థానంలో కారీ బరిలోకి దిగుతున్నాడు. లీగ్‌లోని ఓ మ్యాచ్‌లో కారీ కేవలం 24 బంతుల్లో హాఫ్ సెంచరీ (55) చేశాడు. అదే మ్యాచ్‌కు పాంటింగ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కారీ ఆటను ప్రత్యక్షంగా చూసిన పాంటింగ్‌ ఐపీఎల్ ఢిల్లీ జట్టుకు అతడు రెండు విధాలుగా ఉపయోగపడుతాడని అంటున్నాడు.

పంత్‌కు బ్యాకప్‌గా

పంత్‌కు బ్యాకప్‌గా

'కారీ ప్రస్తుతం నాలుగో స్థానంలో బాగా ఆడుతున్నాడు. ఆ ప్రదర్శనే నన్ను, డిల్లీ క్యాపిటల్స్‌ను ఆకర్షించింది. స్పిన్‌ను కూడా బాగా ఎదుర్కొంటాడు. క్రికెట్‌పై చాలా అవగాహన ఉంది. సమయస్ఫూర్తితో ఆలోచిస్తాడు. జట్టు అవసరాలను బట్టి తన ఆటను మార్చుకుంటాడు. ఐపీఎల్‌-13 సీజన్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడతాడని నమ్ముతున్నా. వికెట్‌ కీపర్‌ పంత్‌కు గాయమైతే కీపింగ్ కూడా చేస్తాడు. పంత్‌కు బ్యాకప్‌ వికెట్‌కీపర్‌గా ఉంటాడు' అని పాంటింగ్‌ అన్నాడు.

ఆత్రుతుగా ఎదురుచూస్తున్నా

ఆత్రుతుగా ఎదురుచూస్తున్నా

ఈ నెల 19న జరిగిన ఐపీఎల్ వేలంలో అలెక్స్ క్యారీని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాంచైజీ రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో కారీ 2020లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. క్యారీ కొనుగోలు విషయంలో పాంటింగ్‌ కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. వేలంలో మంచి ధర పలికినందుకు కారీ సంతోషం వ్యక్తం చేశాడు. ;ప్రపంచంలోనే అతిపెద్దదైన ఐపీఎల్‌లో భాగస్వామిని అవ్వడం ఆనందంగా ఉంది. ఎంతో ఆత్రుతుగా ఎదురుచూస్తున్నా. రికీ సర్‌తో కలిసి పనిచేసేందుకు ఉవ్విళ్లూరుతున్నా' అని కారీ తెలిపాడు.

Story first published: Wednesday, December 25, 2019, 11:29 [IST]
Other articles published on Dec 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+