
హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఇప్పుడు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. గురువారం జరిగిన రిటెన్షన్ జాబితాల విడుదల ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ విషయాన్ని ఆ జట్టు ముఖ్య కార్య నిర్వహణాధికారి హేమంత్ దువా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. ప్రపంచ కప్‌ను మూడు సార్లు గెలిచిన విజేతగా ఆయనను అభినందిస్తూ వ్యాఖ్యానించారు.
పాంటింగ్ 2015, 2016 సంవత్సరాలలో ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గానే వ్యవహరించారు. అదే కాకుండా కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరపున ముంబై ఇండియన్స్ తరపున కూడా టీ20 టోర్నమెంట్‌లో ఆడారు.
ప్రస్తుతం పాంటింగ్ ఫిబ్రవరిలో జరగనున్న ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌కు సన్నద్ధమవుతున్నారు. ఆ జట్టుకు ప్రధాన కోచ్ అయిన డారెన్ లెమన్‌కు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
గురువారం జరిగిన ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలో ఢిల్లీ డేర్ డెవిల్స్ రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, క్రిస్ మొర్రిస్‌ను ఉంచుకున్నట్లు ప్రకటించింది. మిగిలిన వారిని జనవరి 27,28 తేదీల్లో అందరిలానే వేలంలో పాల్గొని కొనుగోలు చేయనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.