న్యూఢిల్లీ: అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశాన్ని విశాఖపట్నంకు చెందిన యువకుడు రికీభుయ్ దక్కించుకున్నాడు. రికీ రంజీ ట్రోఫీలో ముంబైపై 103, బరోడాపై 116, గోవా 103 స్కోర్లు చేసి సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు.
స్వదేశంలో ముక్కోణపు టోర్నీ గెలిచిన భారత జట్టుకు రికీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. శ్రీలంకలో ముక్కోణపు వన్డే టోర్నీ గెలిచిన జట్టులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. కాగా, భారత జట్టు సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ గోకరాజు గంగరాజు తనను ప్రోత్సహించారని.. ప్రపంచకప్‌లో రాణించడానికి శాయశక్తులా కృషి చేస్తానని రికీ భుయ్ తెలిపాడు.
ఇది ఇలా ఉండగా, బంగ్లాదేశ్ వేదికగా జనవరి 22న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం మంగళవారం సెలెక్టర్లు 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేశారు. ఇటీవల శ్రీలంక, ఇంగ్లాండ్ పాల్గొన్న ముక్కోణపు సిరీస్‌లో జట్టును విజయపథంలో నడిపించిన ఇషాన్ కిషన్‌నే ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా కొనసాగించాలని సెలెక్టర్లు నిర్ణయించారు.

ఈ టోర్నీలో గ్రూప్-డిలో ఉన్న భారత్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నేపాల్‌తో లీగ్ దశలో ఆడుతుంది. కాగా, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత మరో జార్ఖండ్ ఆటగాడు భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇషాన్ కిషన్ వచ్చే ఏడాది అండర్-19, వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.
ధోనీ లాగే ఇషాన్ కూడా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ కావడం మరో విశేషం. కాగా, ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా జనవరి 28న మీర్పుర్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో భారత్ పోరు మొదలుకానుంది.
భారత జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, అమన్‌దీప్, అన్‌మోల్‌ప్రీత్‌సింగ్, ఆర్మాన్, రికీ భుయ్, మయాంక్, జీషన్, మహిపాల్ లొమ్‌రోర్, అవేశ్‌ఖాన్, శుభం మవి, ఖలీల్ అహ్మద్, రాహుల్ బదమ్.