
రషీద్ ఖాన్
పాంటింగ్ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్‌ను ప్రపంచంలోని టాప్ టీ20 ప్లేయర్‌గా ఎంచుకున్నాడు. ఈ ఆఫ్ఘన్ లెగ్ స్పిన్నర్ వచ్చే దఫా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో ఒకవేళ పాల్గొంటే.. అతను అత్యధిక మొత్తాన్ని పొందగలడని పేర్కొన్నాడు. రషీద్ ఖాన్ ఇప్పుడు కేవలం బౌలర్ మాత్రమే కాదని.. సమర్థంగా హిట్ చేసే బ్యాటర్ అని కూడా పేర్కొన్నాడు. రషీద్ లాంటి ప్లేయర్ తప్పకుండా జట్టుకు బిగ్ అస్సెట్ అవుతాడు. ఇక అతని ప్రదర్శన గనుక అప్ టు ది మార్క్ ఉన్న రోజు మ్యాచ్ వన్ సైడ్ అవడం ఖాయమని పేర్కొన్నాడు.

బాబర్ ఆజామ్
ఈ ఆసియా కప్ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ పేలవ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబర్ రాణించకున్నా ఆ విషయాన్ని అంతగా పరిగణనలోకి తీసుకోని పాంటింగ్ అతన్ని ప్రపంచంలోని అత్యుత్తమ నంబర్ 2 టీ20 ప్లేయర్‌గా పరిగణించాడు. ప్రస్తుతం వన్డేలు, టీ20ల్లో ర్యాంకింగ్ పరంగా అగ్రస్థానంలో బాబర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తనదైన రోజున అతని ఆటకు తిరుగుండదు.

హార్దిక్ పాండ్యా
పాంటింగ్ భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను 3వ అత్యుత్తమ టీ20 ప్లేయర్‌గా పరిగణించాడు. అలాగే ది బెస్ట్ ఆల్ రౌండర్ అని కూడా పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా ఇటీవల ఆటను బాగా అర్థం చేసుకుంటున్నాడని, అతను గతంలో కంటే మెరుగ్గా తన ఆట స్థాయిని మార్చాడని, అతను బహుశా T20 క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్ రౌండర్ అని ప్రస్తావించాడు. వన్డే క్రికెట్‌లో కూడా హార్దిక్ ది బెస్ట్ ఆల్రౌండర్ అని పాంటింగ్ అన్నాడు.

జోస్ బట్లర్
ఇక ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ల వికెట్ కీపర్ జోస్ బట్లర్‌ను పాంటింగ్ నంబర్ 4 టీ20 ప్లేయర్‌గా ప్రకటించాడు. ఈ ఏడాది ఐపీఎ ఎడిషన్‌లో బట్లర్ నాలుగు సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. అవుట్-అండ్-అవుట్ మ్యాచ్ విన్నర్‌లలో బట్లర్ ఒకడని చెప్పాడు. అతను కంప్లీట్ హిట్టర్ మాత్రమే కాకుండా రెస్పాన్సిబుల్ ప్లేయర్ అని కొనియాడాడు. ఓపెనర్‌గా బట్లర్ ఏమాత్రం నిలదొక్కుకున్న ప్రత్యర్థి బౌలర్లు ఔట్ చేయడానికి అవకాశం ఇవ్వడని చెప్పాడు.

జస్ప్రీత్ బుమ్రా
భారత పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాను నంబర్ 5గా పేర్కొన్న పాంటింగ్.. అతను కంప్లీట్ ఫర్ ఫార్మ్‌డ్ బౌలర్ అంటూ కొనియాడాడు. కొత్త బంతితో బుమ్రా బౌలింగ్ చేస్తే ఎదుర్కోవడం అతి కష్టమన్నాడు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్, వన్డే క్రికెట్, టీ20 క్రికెట్‌లో పూర్తిస్థాయి బౌలర్‌గా కొనసాగుతున్నాడు. టీ20ల్లో అతని డెత్ బౌలింగ్ స్కిల్స్ అతన్ని మిగతా బౌలర్ల నుంచి వేరు చేస్తున్నాయి. టీమిండియాకు బిగ్ అస్సెట్ అయిన బుమ్రా టీ20 వరల్డ్ కప్ టైంకు గాయం నుంచి కోలుకుంటే ఇండియాకు గెలుపు విషయంలో చాలా ఎడ్జ్ ఉంటుందన్నాడు. ప్రస్తుతం గాయం కారణంగా ఆసియా కప్‌కు అతను దూరమయ్యాడు.


Click it and Unblock the Notifications
