రాబోయే టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడే జట్లు ఇవే.. భీకరంగా ఆ మూడు జట్లు, రికీ పాంటింగ్ జోస్యం..!

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, ప్రపంచ కప్ విజేత కెప్టెన్ అయిన రికీ పాంటింగ్.. ఈ ఏడాది అక్టోబర్ - నవంబరులో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరే రెండు జట్లు ఏవో తేల్చేశాడు. రెండు ఫైనల్ బెర్తులను భారత్, ఆస్ట్రేలియా దక్కించుకుంటాయని జోస్యం చెప్పాడు. అందుకు గల కారణాలను కూడా పాంటింగ్ విశ్లేషించాడు. ఇకపోతే టీ20 ప్రపంచకప్ ట్రోఫీ గెలవాలంటే కేవలం ఆట మాత్రమే ముఖ్యం కాదని కూసింత లక్ కూడా కలిసిరావాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇకపోతే వచ్చే టీ20 ప్రపంచకప్ జట్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా మూడు టైటిల్ ఫేవరెట్ జట్లని అభివర్ణించాడు.

అత్యుత్తమ వైట్ బాల్ ఫార్మాట్ జట్టుగా ఇంగ్లాండ్
గత కొంతకాలంగా ఇంగ్లాండ్ అత్యుత్తమ వైట్ బాల్ ఫార్మాట్ జట్టుగా ఎదుగుతుందని పాంటింగ్ కితాబిచ్చాడు. అందుకే ఆ జట్టు టైటిల్ ఫేవరెట్‌లలో ఒకటి అని చెప్పడానికి సంకోచించడం లేదన్నాడు. వైట్-బాల్ ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం దుర్భేద్యంగా తయారైందని, ఆ టీమ్ కోచ్ మాథ్యూ మోట్ గైడెన్స్ కూడా బాగుంటుందని ప్రశంసించాడు. గతంలో ఆస్ట్రేలియా మహిళల టీంకు మాథ్యూ వేట్ కోచింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతని కోచింగ్లోనే ఆసీస్ మహిళల టీం టీ20ప్రపంచకప్ గెలవడంతో పాటు నంబర్ 1టీంగా ఎదిగింది.

ఫైనల్లో అందుకే ఆస్ట్రేలియా గెలుస్తుంది
ఇక పాంటింగ్ మాట్లాడుతూ.. 'భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌లో తలపడతాయని నేను భావిస్తున్నాను. ఇక ఫైనల్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియాకు హోం గ్రౌండ్లో ఆడడం కలిసొస్తుందని చెప్పాలి. గత టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా యూఏఈలోనూ విజయాన్ని సాధించింది. అది హోం కంట్రీ కాదు. అయినా ఆస్ట్రేలియా ఓ మధురమైన విజయాన్ని దక్కించుకుంది. ఐపీఎల్ నేపథ్యంలో గతంలో యూఏఈ పరిస్థితులపై ఆస్ట్రేలియన్లకు కూడా కొంత అవగాహన వచ్చిన మాట వాస్తవమే. అందువల్ల టీం అక్కడ గెలవడానికి ఒక మార్గాన్ని కనుగొంది' అని పాంటింగ్ పేర్కొన్నాడు.

ఆ మూడు జట్లు టైటిల్ వేటలో..
అలాగే ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు ప్రదర్శనను కూడా రికీ పాంటింగ్ మెచ్చుకున్నాడు. ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మార్గదర్శకత్వంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ నాయకత్వంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లాండ్ వైట్ వాష్ చేయగా.. భారత్‌తో రీషెడ్యూల్ చేసిన టెస్ట్ మ్యాచ్‌ను కూడా ఇంగ్లాండ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్ విషయంలో ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్ జట్లు పేపర్ మీద చాలా భీకరంగా కన్పిస్తున్నాయని చెప్పాడు. ఈ మూడు జట్లకు అత్యధిక క్లాస్, అత్యధిక మ్యాచ్ విన్నర్లయిన ప్లేయర్లున్నారు. ఈసారి ప్రపంచకప్ టోర్నీలో అత్యుత్తమగా రాణించే జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అని నేను భావిస్తున్నాను' అని పాంటింగ్ స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications