సూర్యకుమార్ యాదవ్ కెరీర్ అప్పుడే మలుపు తిరిగింది.. రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. భారత మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ ప్రస్తుతం టీమిండియాలో కీలక ప్లేయర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే సత్తా, స్టేడియం నలువైపులా బౌండరీలు బాదే అతని స్కిల్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అతను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా ఇంపార్టెంట్ ప్లేయర్‌గా మారాడు. ఇకపోతే పాంటింగ్ సూర్యకుమార్ కెరీర్లో కీలక టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పాడు. ఐపీఎల్లో అతనికి దక్కిన అవకాశమే అతని కెరీర్‌కు కీలకమైందన్నాడు.

వచ్చిన కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కెరీర్ తొలినాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే అతనికి అవకాశాలు మాత్రం రాలేదు. తదనంతరం అతనికి కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు వెల్‌కం చెప్పింది. కోల్‌కతా తరఫున అతనికి మంచి అవకాశాలు లభించాయి.
అక్కడ అతను వచ్చిన కొన్ని అవకాశాల్లో సత్తా చాటాడు. కోల్‌కతా తరఫున ఆడడం ద్వారానే సూర్యకుమార్ యాదవ్ కెరీర్ మలుపు తిరిగిందని పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇకపోతే కేకేఆర్ తరఫున నాలుగు సీజన్లు ఆడిన అనంతరం.. అతని ప్రతిభను గుర్తించిన ముంబై ఇండియన్స్ 2018వేలంలో అతన్ని కొనుక్కుంది.
కేకేఆర్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగే సూర్య.. ముంబై తరఫున మాత్రం మిడిలార్డర్లో, నంబర్ 3పొజిషన్లో బ్యాటింగ్ దిగేవాడు. అక్కడ నుంచి సూర్య ఇక వెనుదిరిగి చూడలేదు. ఐపీఎల్ 2020లో అతను 40సగటుతో 480పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక ఈ ప్రదర్శన తర్వాత సూర్యకు టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కింది.

అప్పుడు 19ఏళ్ల కుర్రాడు
'నేను ముంబై ఇండియన్స్ తరఫున తొలినాళ్లలో ఆడుతున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ 19ఏళ్ల కుర్రాడు. అప్పుడు మా స్క్వాడ్‌లో ఉన్నాడు. నేను ఐపీఎల్ ఆడడం మానేశాక.. అతను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడే అతని కెరీర్ మలుపు తిరిగింది. అతనికి అక్కడ అవకాశాలొచ్చాయి. తానేంటో చూపించుకున్నాడు.
ఆ తర్వాత ముంబై మళ్లీ అతన్ని వేలంలో కొనుగోలు చేసింది. గత నాలుగు సీజన్లుగా అతను ఓ మ్యాచ్ విన్నర్‌గా మారాడు. అందుకే ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో సూర్య ఒకడు' అని పాంటింగ్ చెప్పాడు.

చిన్నప్పటి నుంచి చూసినవారికి సూర్య ఏంటో తెలుసు
ఇకపోతే సురేశ్ రైనా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, హర్మన్‌ప్రీత్ కౌర్ తర్వాత టీ20ల్లో సెంచరీ సాధించిన ఆరో భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ తొలిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో సూర్య ఉన్నాడు. 'చిన్నప్పటి నుంచి అతని ఆటను చూసిన ఎవరికైనా అతనిలో ఎంతటి ట్యాలెంట్ ఉందో బాగా తెలిసే ఉంటుంది.
అతను కాస్త లేటుగా జట్టులోకి వచ్చినా.. అతను ఇన్నాళ్లుగా విభిన్న పరిస్థితుల్లో, లైనప్లో భిన్న పొజిషన్లలో ఆడడం నేర్చుకున్నాడు. అది అతనికి బాగా ఉపయోగపడింది. ఐపీఎల్లో దాదాపు బ్యాటింగ్ ఆర్డర్లో అన్ని రకాల స్థానాల్లో ఆడిన అనుభవం ఉండడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈజీగా పరిస్థితులను అడప్ట్ చేసుకోగలుగుతున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్ జట్టులో సూర్య కీలక పాత్ర పోషించడం ఖాయమని' పాంటింగ్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications