న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా గొప్పా..! షాహీన్ అఫ్రిది గొప్పా..? టీ20 వరల్డ్‌కప్‌లో ఎవరిదీ పైచేయి? రికీ పాంటింగ్ చెప్పిన సమాధానమిదే

Rickey Ponting Expected Jasprit Bumrah is Better than Shaheen Afridi in Upcoming T20 World cup

టీ20 వరల్డ్‌‌కప్ 2022లో పాకిస్థాన్‌కు చెందిన షాహీన్ అఫ్రిది కంటే జస్ప్రీత్ బుమ్రా మెరుగ్గా రాణిస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పాడు. ఇటీవల బుమ్రా, అఫ్రిది ఆసియా కప్ 2022 టోర్నీకి గాయాల కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. బుమ్రా గత మూడు నాలుగేళ్లుగా భారత ప్రధాన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 6.46ఎకానమీ రేటుతో ఇప్పటివరకు 58 టీ20లలో అతను 69వికెట్లు తీశాడు. అతను లేకపోవడంతో ఆసియాకప్‌లో భారత బౌలింగ్ విభాగం కాస్త ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20లో కూడా భారత బౌలింగే ప్రధాన సమస్యగా కన్పించింది. ఇకపోతే అఫ్రిది అరంగేట్రం చేసినప్పటి నుండి సంచలనాత్మక ప్రదర్శన చేస్తున్నాడు. అతను అత్యుత్తమ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇకపోతే టీ20 ప్రపంచకప్ జరిగే ఆస్ట్రేలియా పరిస్థితులలో మెరుగ్గా రాణించగల వారిలో జస్ప్రీత్ బుమ్రా.. షాహీన్ అఫ్రిది కంటే మెరుగ్గా ఉంటాడనే అభిప్రాయాన్ని ఐసీసీ రివ్యూలో వ్యక్తం చేశాడు. ఇక బుమ్రా గొప్పా, లేక షాహీన్ గొప్ప అనే క్వశ్చన్‌ను బుమ్రా భార్య సంజనా గణేషన్ అడిగింది.

'చూడండి. షాహీన్ అఫ్రిది, బుమ్రా ఇద్దరిలో ఎవరినీ గొప్ప అంటే ఏం చెబుతాము. గత రెండు సంవత్సరాలుగా అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బౌలర్లలో వీరిద్దరూ ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం ఈ టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా మెరుగ్గా బౌలింగ్ చేయగలడని అనుకుంటున్నా. అతను ఆస్ట్రేలియాలో చాలా క్రికెట్ ఆడాడు. ఆఫ్రిది కంటే ఆస్ట్రేలియాలో ఎక్కువ అనుభవాన్ని పొందాడు. అలాగే షాహీన్ అఫ్రిదితో పోల్చితే బుమ్రా పెద్ద పెద్ద టోర్నీలు ఎక్కువగా ఆడాడు.' అని పాంటింగ్ తెలిపాడు.

అలాగే టీ20 ఫార్మాట్‌లో జోస్ బట్లర్, బాబర్ ఆజామ్ మధ్య మెరుగైన బ్యాటర్‌‌గా ఎవరినీ పేర్కొంటారని అడగగా పాంటింగ్ బట్లర్‌ను పేర్కొన్నాడు. బట్లర్ చాలా'డైనమిక్' ప్లేయర్ అని తెలిపాడు. బాబర్ ఆజం కంటే టెక్నికల్‌గా బట్లర్ మెరుగైన ఆటగాడు. ఇద్దరి స్ట్రైక్‌రేట్లను పరిశీలిస్తే ఎక్కడా మీకు పోలీక కన్పించదు. బాబర్ క్లాసిక్ ప్లేయర్. బట్లర్ హిట్టర్. బట్లర్ 360-డిగ్రీల ప్లేయర్ అని పాంటింగ్ పేర్కొన్నాడు.

Story first published: Friday, September 23, 2022, 14:36 [IST]
Other articles published on Sep 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X