స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత మహిళల జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్, శ్రీలంకపై గెలిచిన భారత్ బలమైన ప్రత్యర్థులు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై సెమీఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయాయి. అయితే టోర్నీ నుంచి నిష్క్రమణ అనంతరం టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌పై విమర్శలు వచ్చాయి. సారథి మార్పు చేయాలని డిమాండ్ వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని జట్టును నిర్మించాలని సూచనలు వచ్చాయి.

మరోవైపు హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ భవితవ్యంపై సెలక్షన్ కమిటీ, కోచ్‌తో బీసీసీఐ ప్రత్యేక సమావేశం కానుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే హర్మన్‌ప్రీత్‌నే సారథిగా కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. కాగా, న్యూజిలాండ్‌తో సిరీస్‌కు కొందరు ప్లేయర్లు దూరం కావడంతో.. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు సయాలీ సత్‌ఘరే, సైమా ఠాకూర్, లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా, మిడిలార్డర్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్ తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యారు.
ఇంటర్ ఎగ్జామ్స్ కారణంగా వికెట్ కీపర్ రిచా ఘోష్ కివీస్ సిరీస్‌కు దూరమైంది. 2020లో 16 ఏళ్ల వయస్సులో రిచా ఘోష్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. మరోవైపు గాయం కారణంగా లెగ్ స్పిన్నర్ ఆశా శోభన జట్టుకు అందుబాటులో లేదు. ఆల్‌రౌండర్ పూజ వస్త్రాకర్‌కు విశ్రాంతి ఇచ్చారు.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలి వర్మ, హేమలత, దీప్తిశర్మ, జెమీమా, యాస్తిక, ఉమ ఛెత్రి, సయాలి, అరుంధతిరెడ్డి, రేణుక, తేజల్, సైమా థాకూర్, ప్రియ మిశ్రా, రాధ, శ్రేయంక పాటిల్.