Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్ విజయంలో ఆమెనే హీరో: సౌరవ్ గంగూలీ

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్‌ను శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అపూర్వరీతిలో సన్మానించారు. ఆ సభలో బెంగాల్ క్రికెట్ దిగ్గజం, క్యాబ్(CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాల్గొని రిచా ఘోష్ ప్రదర్శనను కొనియాడారు. రిచా ఘోష్‌కు లభించిన సన్మానాల్లో కేవలం క్రీడా సంస్థల అభినందనలే కాకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి అత్యున్నత గౌరవాలు దక్కాయి.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రిచాకు రాష్ట్ర అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన 'బంగ భూషణ్' మెడల్‌ను అందించారు. క్రీడల ద్వారా రాష్ట్రానికి గౌరవం తెచ్చినందుకు గానూ రిచాకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) స్థాయి నియామక పత్రాన్ని కూడా అందించారు. సీఎం చేతుల మీదుగా బంగారు గొలుసు బహూకరించగా.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ రిచాకు భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ప్రపంచ కప్ ఫైనల్లో రిచా చేసిన ప్రతి పరుగుకు ఒక లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.34 లక్షల భారీ చెక్‌ను అందించారు. క్యాబ్ తరఫున ఆమెకు ఒక అందమైన బంగారు బ్యాట్, బంతిని కూడా బహూకరించి.. ఆమెను 'బెంగాల్ గర్వకారణం'గా ప్రకటించారు. 'బంగ భూషణ్', 'బంగ విభూషణ్' వంటి పురస్కారాలు కళ, సంస్కృతి, సాహిత్యం, ప్రజా సేవ వంటి రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు మాత్రమే ఇస్తారు. క్రికెటర్‌కు ఈ గౌరవం దక్కడం ఆమె అసాధారణ ప్రతిభకు నిదర్శనం.

Richa Ghosh Honoured for World Cup Win Sourav Ganguly Calls Her the Real Hero

దాదా దృష్టిలో రిచా
క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. సిలిగురికి చెందిన 22 ఏళ్ల రిచా ఘోష్ రాష్ట్రానికి మొట్టమొదటి ప్రపంచకప్ విజేతగా నిలవడం చారిత్రకమని పేర్కొన్నారు. 2003లో భారత పురుషుల జట్టు కెప్టెన్‌గా ప్రపంచకప్‌ను గెలవలేకపోయిన గంగూలీ.. రిచాను ప్రశంసిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "రిచా రాష్ట్రానికే గొప్ప కీర్తిని, గౌరవాన్ని తెచ్చింది. ఆమె తన అద్భుతమైన ప్రదర్శనను ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఆమె ఆటతీరు చూస్తుంటే, ఒక రోజు ఆమె ఖచ్చితంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను," అని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫైనల్లో రిచా మెరుపులు
రిచా ఘోష్ తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రపంచకప్ ఫైనల్‌లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఆమె 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి, కేవలం 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 34 పరుగుల దూకుడైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమె దూకుడే జట్టును విజయం వైపు నడిపింది. 'ఫినిషర్' పాత్రపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ రిచా.. "నాకు ఒత్తిడి అంటే ఇష్టం. ఒత్తిడిలో ఆడటమే నన్ను మెరుగైన క్రీడాకారిణిగా మారుస్తుంది. నేను నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా, నిర్దిష్ట లక్ష్యం (టైం/పరుగులు) పెట్టుకుని ఎంత సాధించగలను అని లెక్కించుకుంటాను. ఈ పద్ధతే నాకు బాగా ఉపయోగపడుతుంది" అని తన విజయ రహస్యాన్ని పంచుకుంది.

సభలో పాల్గొన్న ప్రముఖులు
ఈ చారిత్రక సన్మాన కార్యక్రమంలో బెంగాల్ క్రికెట్‌కు చెందిన ఇతర ప్రముఖులు, రాజకీయ నాయకులు, రిచా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బెంగాల్ మహిళా క్రికెట్ ఐకాన్ ఝులన్ గోస్వామి, రాష్ట్ర క్రీడా మంత్రి అరూప్ బిస్వాస్, ఉత్తర బెంగాల్ ప్రాంతానికి చెందిన నటి, పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ) మిమి చక్రవర్తి పాల్గొన్నారు. రిచా ఘోష్ తల్లిదండ్రులు మానబేంద్ర- స్వప్న ఘోష్ తమ కుమార్తె ఈ గౌరవం అందుకోవడం చూసి భావోద్వేగానికి లోనయ్యారు.

Story first published: Sunday, November 9, 2025, 9:46 [IST]
Other articles published on Nov 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+