Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్ర‌పంచ‌క‌ప్ వైఫ‌ల్యాల తొలి వేటు: బంగ్లాదేశ్ హెడ్ కోచ్ గెంటివేత‌!

Rhodes exits as Bangladesh head coach

ఢాకా: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ వైఫ‌ల్యాల‌కు సంబంధించి తొలి వేటు ప‌డిపోయింది. బంగ్లాదేశ్ క్రికెట్ ప్ర‌ధాన కోచ్ స్టీవ్ రోడ్స్ ఉద్వాస‌నకు గుర‌య్యారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులు జ‌ట్టు హెడ్ కోచ్ ప‌ద‌వి నుంచి ఆయ‌న‌ను తొల‌గించారు. ఈ మేర‌కు బోర్డు ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి నిజాముద్దీన్ చౌధురి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వులు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు. ఇంగ్లండ్‌లో ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ముగించుకుని ఆదివారమే బంగ్లాదేశ్ జ‌ట్టు స్వ‌దేశానికి చేరుకుంది. జ‌ట్టు స్వ‌దేశానికి చేరుకున్న రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే- స్టీవ్ రోడ్స్‌ను గెంటేశారు బోర్డు అధికారులు.

వైఫ‌ల్యాలే కార‌ణమా?

వైఫ‌ల్యాలే కార‌ణమా?

బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆశించిన స్థాయి కంటే అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌నే ఇచ్చింది. బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికాను ఓడించింది. వెస్టిండీస్‌ను మ‌ట్టి క‌రిపించింది. ఆఫ్ఘ‌నిస్తాన్‌పై ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, భార‌త్‌, న్యూజిలాండ్ వంటి జ‌ట్ల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌గ‌లిగింది. మొత్తంగా- ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో బంగ్లాదేశ్ ఆడిన తొమ్మిది మ్యాచుల్లో మూడు విజ‌యాల‌ను సొంతం చేసుకుంది. శ్రీలంక‌తో జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం వ‌ల్ల ర‌ద్ద‌యింది. అయిదు ఓట‌ములు, మూడు విజ‌యాల‌తో ఆ జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ త‌ర‌హా ఫ‌లితాలు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును ఏ మాత్రం సంతృప్తినివ్వ‌లేక‌పోయాయి.

 వైఫ‌ల్యాల‌కు హెడ్ కోచ్ బాధ్యుడిగా..

వైఫ‌ల్యాల‌కు హెడ్ కోచ్ బాధ్యుడిగా..

ఈ వైఫ‌ల్యాల‌కు జ‌ట్టు హెడ్ కోచ్ స్టీవ్ రోడ్స్‌ను బాధ్యుడిని చేసింది క్రికెట్ బోర్డు. ఉన్న‌ఫ‌ళంగా ఆయ‌న‌ను తొల‌గించింది. స్టీవ్ రోడ్స్ గ‌త ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. 13 నెల‌ల కాలంలోనే ఆయ‌నను తొల‌గించింది. వ‌చ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జ‌రిగే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ముగిసేంత వ‌ర‌కూ ఆయ‌న కాంట్రాక్ట్ కొన‌సాగాల్సి ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆశించిన ఫ‌లితాలు రాక‌పోవ‌డం వ‌ల్ల స్టీవ్ రోడ్స్‌కు మంగ‌ళం ప‌లికింది. కొత్త కోచ్ కోసం అన్వేష‌ణ‌లో ప‌డింది.

స‌మ‌ర్థించుకున్న బోర్డు..

స‌మ‌ర్థించుకున్న బోర్డు..

కాంట్రాక్టు కాల ప‌రిమితి ఇంకా ఉన్న‌ప్ప‌టికీ.. స్టీవ్ రోడ్స్‌ను తొల‌గించ‌డాన్ని నిజాముద్దీన్ చౌధురి స‌మ‌ర్థించుకున్నారు. తాము తీసుకున్న ఈ చ‌ర్య‌ను ఉద్వాస‌న‌గా గుర్తించ‌వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. వ‌చ్చే ఏడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ జ‌రుగ‌నున్నందున‌.. జ‌ట్టును ఇప్ప‌టి నుంచే స‌మాయాత్తం చేయ‌డంలో భాగంగానే ఆయ‌న‌ను తొల‌గించిన‌ట్లు చెప్పారు. బంగ్లాదేశ్ బౌలింగ్ కోచ్‌లుగా ప‌నిచేస్తోన్న వెస్టిండీస్ లెజెండ‌రీ ఫాస్ట్ బౌల‌ర్ కోట్నీ వాల్ష్‌ను కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు బోర్డు అధికారులు. ప్ర‌స్తుతం కోట్నీ వాల్ష్ ఫాస్ట బౌలింగ్‌కు, సునీల్ జోషి స్పిన్ బౌలింగ్ విభాగంలో కోచ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స్పిన్ బౌలింగ్ కోచ్‌, టీమిండియా మాజీ స్పిన్న‌ర్ సునీల్ జోషి ప‌ద‌వికి కూడా ఎస‌రు ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Story first published: Tuesday, July 9, 2019, 13:08 [IST]
Other articles published on Jul 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+