For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH: ఇట్స్ రివెంజ్ టైమ్.. ముద్దుల సరదా తీర్చాలి (Memes)

సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక సమరానికి సిద్ధమైంది. ఫైనల్ బెర్తు కోసం అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయిర్-1లో ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు క్వాలిఫయిర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌తో పోటీపడాలి.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడగా కేకేఆర్ 17 సార్లు, ఎస్‌ఆర్‌హెచ్ తొమ్మిది సార్లు గెలిచాయి. ఈ సీజన్‌లో లీగ్ దశలో కోల్‌కతా-హైదరాబాద్ ఓ సారి తలపడ్డాయి. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో కేకేఆర్ గెలిచింది. అయితే ఈ పోరు‌తో ఐపీఎల్-2024 హీటెక్కింది. కవ్వింపులతో కొనసాగిన ఈ మ్యాచ్ సీజన్‌ను ఆసక్తికరంగా మార్చేసింది.

Revenge Time SRH Fans Post Memes on Harshit Rana Ahead of Clash with KKR

హర్షిత్ రాణా- మయాంక్ అగర్వాల్ మధ్య జరిగిన సంఘటన క్రికెట్ అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ శుభారంభాన్ని సాధించింది. మయాంక్ అగర్వాల్-అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం సాధించారు. అయితే పవర్‌ప్లే ఆఖరి ఓవర్‌లో మయాంక్‌ను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. షాట్‌కు యత్నించిన మయాంక్ రింకూ చేతికి చిక్కాడు.

అనంతరం హర్షిత్ అతిగా సంబరాలు చేసుకున్నాడు. మయాంక్‌కు దగ్గరగా వచ్చి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. అంతేగాక మైదానం నుంచి వెళ్లిపో అంటూ పొగరుగా సంజ్ఞ చేశాడు. ఆఖరి ఓవర్‌లో క్లాసెన్ వికెట్ తీసి కూడా హర్షిత్ దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది. కేకేఆర్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని నెట్టింట పోస్టులు వెల్లువెత్తాయి. కానీ లీగ్ దశలొ ఇరు జట్లకు ఒకే మ్యాచ్ షెడ్యూల్ అయ్యింది.

కానీ కేకేఆర్-ఎస్‌ఆర్‌హెచ్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో ఇరు జట్లు మరోసారి తలపడనున్నాయి. దీంతో హర్షిత్ రాణాకు ముద్దుల సరదా తీర్చాలని సన్‌రైజర్స్ జట్టును ఆరెంజ్ ఆర్మీ కోరుతోంది. కోల్‌కతాను చిత్తుగా ఓడించి, ఫైనల్‌కు చేరాలని ఆల్‌దిబెస్ట్ చెబుతోంది. మరోవైపు హర్షిత్ రాణాపై ఫన్నీ మీమ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Story first published: Tuesday, May 21, 2024, 12:33 [IST]
Other articles published on May 21, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+