11 మ్యాచ్‌లే: జట్టులో ధోని ఎంపికకు అసలు కారణం ఇదీ!

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో వరుసగా టీ20 సిరీస్‌లకి దూరమైన ధోని, దాదాపు మూడు నెలల తర్వాత మళ్లీ భారత తరఫున మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వచ్చే ఏడాది జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం 16 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ బుధవారం ప్రకటించింది. పేలవ ఫామ్ కారణంగా టీ20 జట్టులో చోటు కోల్పోయిన మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి వికెట్ కీపర్‌గా వన్డే, టీ20 జట్టులో భారత సెలక్టర్లు చోటు కల్పించిన సంగతి తెలిసిందే.

ధోనీ భవితవ్యంపై ఓ నిర్ణయానికి
2019 వరల్డ్ కప్‌లోపు ధోనీ భవితవ్యంపై ఓ నిర్ణయానికి రావాలనే ఉద్దేశంతోనే సెలక్టర్లు ఈ అవకాశమిచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ధోనికి మళ్లీ చోటు కల్పించచడంపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ "2019 ప్రపంచకప్‌కి ముందు ధోనీ కేవలం 8 వన్డేలు మాత్రమే ఆడే అవకాశముంది" అని అన్నాడు.

మొత్తం 11 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో
"కివీస్‌తో ఆడే మూడు టీ20లు కలుపుకుంటే.. మొత్తం 11 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను ఆడనున్నాడు. వరల్డ్‌కప్‌కి ముందు అతను కుదురుకునేందుకు తగినన్ని అవకాశాలివ్వాలనే ఉద్దేశంతోనే సెలక్టర్లు వన్డే, టీ20 జట్టులోకి ఎంపిక చేశారు" అని ఆయన అన్నారు. ఒకవేళ ధోనీ ఫామ్ అందుకోలేకపోతే వరల్డ్ కప్‌లో ఆడిస్తారా? అనేదానిపై మాత్రం మాట్లాడేందుకు నిరాకరించాడు.

ఫామ్‌ని అందుకోలేకపోయిన ధోని
ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన.. మధ్యలో వెస్టిండీస్, ఆసియా కప్ ఇలా ధోనీకి వరుస అవకాశాలు ఇచ్చినా... పూర్వపు ఫామ్‌ని అందుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో అభిమానులు మెరుపులు చూడకపోయినప్పటికీ, వికెట్ల వెనుక అతని నైపుణ్యం, వ్యూహాల్లో అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న సెలక్టర్లు తుది జట్టులో చోటు కల్పించారు.

మళ్లీ ధోనీవైపు మొగ్గుచూపిన సెలక్టర్లు
వెస్టిండిస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మాత్రం ధోనిపై వేటు వేసి వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కి సెలక్టర్లు అవకాశమిచ్చారు. అయితే, 2019 వరల్డ్‌కప్‌కి ధోనినే వికెట్ కీపర్‌గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. మళ్లీ ధోనీవైపు మొగ్గుచూపిన సెలక్టర్లు, వరల్డ్‌కప్‌లోపు అతనికి తగినన్ని అవకాశాలివ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications